నగదు రహిత లావాదేవీలకు నజరానా

8 Dec, 2016 06:27 IST|Sakshi
నగదు రహిత లావాదేవీలకు నజరానా

కేంద్ర ప్రభుత్వం ప్రకటన.. ప్రతి లావాదేవీపై కలెక్టర్లకు రూ.10
 
 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం నజరానాలను ప్రకటిస్తోంది. డిజిటల్ మనీ వినియోగాన్ని విస్తృతం చేయ డానికి కలెక్టర్లకు నగదు బహుమతులు అందజేయనుంది. కరె న్సీ వాడకాన్ని తగ్గించి ఆన్‌లైన్  చెల్లింపుల వైపు ప్రజలను మళ్లించేలా కృషి చేసే కలెక్టర్లు, పౌర సేవా కేంద్రాల ప్రతినిధులకు క్యాష్ అవార్డులు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. యూపీఐ, యూఎస్‌ఎస్‌డీ, ఆధార్ ఆధారిత, డిజిటల్ రూపే, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్లు చేసేవారి సంఖ్య పెంపొందించాలని కేంద్రం నిర్ణయించింది. కొత్తగా ఏ ఇద్దరిని ఎలక్టాన్రిక్ చెల్లింపుల వైపు మళ్లించగలిగితే అందుకు ప్రోత్సాహకం గా సంబంధిత కలెక్టర్లకు రూ.10 నగదు అందించనున్నట్లు నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ప్రకటించారు.

ఈ మేరకు దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆయన లేఖ రాశారు. అంతేగాకుండా వ్యాపార వర్గాలు ఆన్‌లైన్ చెల్లింపుల బాట పట్టేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. ఈ మేరకు పౌర సేవా కేంద్రాల ప్రతినిధుల కు నగదు కానుకలు ప్రకటించింది. నగదు రహిత లావాదేవీల వైపు టోకు వ్యాపారిని మళ్లిస్తే రూ.100, చిన్న లావాదేవీలపై రూ.5 ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఈ-పేమెంట్ల అమలులో అగ్రస్థానంలో నిలిచిన పది జిల్లాలను ఎంపిక చేసి వాటిని ‘డిజిటల్ పేమెంట్ చాంపియన్‌‌స’గా పురస్కారాలు అందజేస్తారు. నగదు రహిత గ్రామ పంచాయతీలకూ అవార్డులు ప్రదానం చేయాలని కేంద్రం నిర్ణరుుం చింది. బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్లు, ఈ-వ్యాలెట్ల వినియోగం పెరిగేలా క్షేత్ర స్థారుులో పెద్ద ఎత్తున ప్రచారం చేసేలా కలెక్టర్లకు బాధ్యత అప్పగించారు.

మరిన్ని వార్తలు