పదోన్నతులపై కదిలిన ప్రభుత్వం

6 Jan, 2018 04:28 IST|Sakshi

జాబితాను తయారు చేసి ఏపీకి పంపాలని 

సాగునీటి శాఖ ఈఎన్సీకి స్పెషల్‌ సీఎస్‌ మెమో 

సాక్షి, హైదరాబాద్‌: నీటి పారుదలశాఖలో విభజనకు ముందున్న ఇంజనీర్ల సీనియార్టీ జాబితాను తమకు ఇవ్వాలని కోరిన ఆంధ్రప్రదేశ్‌ వినతిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఉమ్మడి జాబితాను అనుభవమున్న అధికారి ద్వారా వీలైనంత త్వరగా ఏపీ జలవనరుల శాఖకు అందించాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌కే జోషి శాఖ ఈఎన్సీ(అడ్మిన్‌)కు శుక్రవారం మెమో జారీ చేశారు. ఏపీకి పంపే జాబితాను ప్రభుత్వానికి సైతం సమర్పించాలని సూచించారు. ఈ అంశానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.  

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు