తెలంగాణ ప్రజలపై పగబట్టిన చంద్రబాబు

23 Sep, 2016 03:21 IST|Sakshi
తెలంగాణ ప్రజలపై పగబట్టిన చంద్రబాబు

ధ్వజమెత్తిన ప్రభుత్వ విప్ సునీత
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రజలపై పగబట్టారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత విమర్శించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టకుండా అడ్డంకులు సృష్టిస్తూ కుట్రలకు పాల్పడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు.  గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. అపెక్స్ కమిటీ సమావేశంలో బాబు తాను తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకమని విషంకక్కినా టీటీడీపీ నేతలు నోరు మెదపలేదన్నారు. అందరూ బాగుండాలనేది కేసీఆర్ వ్యక్తిత్వమయితే, అందరూ నాశనమైనా తాను బాగుండాలనే రాక్షసత్వం బాబుదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను కొత్త ప్రాజెక్టని బాబు అనడం దారుణమన్నారు.

మరిన్ని వార్తలు