రాష్ట్రపతికి గవర్నర్‌ విందు

28 Dec, 2016 03:47 IST|Sakshi
రాష్ట్రపతికి గవర్నర్‌ విందు

- హాజరైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
- విద్యుత్‌ వెలుగులతో కాంతులీనిన రాజ్‌భవన్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ గౌరవార్ధం గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం ఘనంగా జరి గింది. మంగళవారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ విందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సీఎం లతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యా రు. సరిగ్గా రాత్రి 8కు ప్రణబ్‌ముఖర్జీ రాజ్‌భవ న్‌కు చేరుకున్నారు. గవర్నర్‌ దంపతులు నరసిం హన్, విమలా నరసింహన్‌ ఆయనకు స్వాగతం పలికారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు తన సతీ మణి శోభతో కలసి రాష్ట్రపతి రాకకు ముందే అక్క డికి చేరుకున్నారు. రాష్ట్రపతి వచ్చిన కొద్దిసేపటికి ఏపీ సీఎం చంద్రబాబు వచ్చారు. చంద్రబాబు, కేసీఆర్‌ అభివాదం చేసుకొని పరస్పరం పలకరిం చుకున్నారు. పుష్పగుచ్ఛం అందించి రాష్ట్రపతికి అభివందనం చేశారు.

అనంతరం రాజ్‌భవన్‌ లాంజ్‌లో గవర్నర్‌తో పాటు ఇద్దరు సీఎంలు రాష్ట్రపతితో కూర్చున్నారు. సీఎంలిద్దరూ అంద రినీ పలుకరిస్తూ పలు అంశాలపై చర్చించుకు న్నారు. మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, కేంద్రమంత్రులు దత్తాత్రేయ, సుజనాచౌదరి, తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య, ఎంపీలు కె.కేశవరావు, కవిత,  డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, ఏపీ మంత్రులు చినరాజప్ప, యనమల, క్రీడాకారులు సానియా మీర్జా, పీవీ సింధు, రెండు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, పలువురు ఉన్నతాధికారులు విందులో పాల్గొ న్నారు. రాజ్‌భవన్‌ లాంజ్‌ను విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు.

ఘుమఘుమలాడిన వంటకాలు
విందులో ఏర్పాటు చేసిన వంటకాలు ఘుమఘుమలాడాయి. హైదరాబాద్‌ ప్రత్యే కతను చాటిచెప్పే హైదరాబాద్‌ సబ్జీ బిర్యానీ, మిర్చి కా సలాన్, పనీర్‌ కత్తా ప్యాజ్, లాసోని చిరోంజి పాలక్, ఆలు కట్లియా, హైదరా బాద్‌ కత్తీ దాల్, గోంగూర, వంకాయ, టమాట పచ్చడి, మలాయి కుల్ఫీ విత్‌ ఫాలుదా, జొన్న రొట్టె తదితర వంటకాలను వడ్డించారు. విందు అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు, గవర్నర్‌ దంపతులు రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు.

మరిన్ని వార్తలు