గుడుంబా రహిత హైదరాబాద్

3 Oct, 2016 02:47 IST|Sakshi
గుడుంబా రహిత హైదరాబాద్

ఇందుకోసం అధికారులు చర్యలు తీసుకోవాలి: పద్మారావు

 హైదరాబాద్: గుడుంబా రహిత ప్రాంతంగా హైదరాబాద్‌ను మారుస్తామని ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ మంత్రి పద్మారావు పేర్కొన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... రాష్ట్రంలో గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో దాన్ని నిర్మూలించామని వివరించారు. వచ్చే ఏడాదిలోగా హైదరాబాద్‌ను కూడా గుడుంబా రహిత జిల్లాల సరసన చేర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. గుడుంబా తయారీపై ఆధారపడి జీవించే వారికి పునరావాసం కల్పిస్తామని.. ఇందు కోసం జిల్లాకు రూ.10 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు.

రుగ్మతలను తొలగించాలంటే గుడుంబాను పూర్తిగా నిషేధించాలని, ఆ దిశగా తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించడం కంటే ఆచరించడం ఎంతో కష్టమని జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. గుడుంబా అంతానికి శక్తివంచన లేకుండా కష్టపడుతున్నట్లు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్ వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ భగవాన్‌రెడ్డి, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ సి.వివేకానంద రెడ్డి, ఇన్‌చార్జి డెరైక్టర్ ఎన్.అజయ్ రావు, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ శ్రీవాత్సవ్, ఇతర అధికారులు రాజేశ్వర రావు, ఫారుఖీ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ నుంచి రవీంద్రభారతి వరకు ఎకై ్సజ్ పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాక్‌డౌన్‌ తప్ప మరో మార్గం లేదు: కేసీఆర్‌

నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన బిట్స్‌ పిలానీ

మహారాష్ట్రకు మేఘా రూ.2 కోట్ల విరాళం

యాంకర్‌ సుమ ఆడపడుచు మృతి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

సినిమా

తమ్మారెడ్డికి చిరంజీవి పరామర్శ

స్టార్‌ కమెడియన్‌ మృతి

కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

శుభవార్త చెప్పిన స్టార్‌ జంట

బిగ్‌బాస్‌: ‘అవును ప్రేమించుకుంటున్నాం’

యాంకర్‌ సుమ ఆడపడుచు మృతి