గురుకులాలు అదుర్స్

12 May, 2016 02:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ఫలితాల్లో సంక్షేమ గురుకులాలు ఉత్తమ ఫలితాలను సాధించాయి. మహాత్మా జ్యోతిబా ఫూలే (బీసీ) గురుకులాలు 96 శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు నెలకొల్పాయి. ఇది రాష్ట్ర ఉత్తీర్ణత శాతం (86%) కంటె పది శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఇక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 90 శాతం, ఎస్టీ గురుకుల పాఠశాలలు 84 శాతం ఉత్తీర్ణత సాధించాయి. బీసీ గురుకులాల్లో మొత్తం 1307 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 1248 మంది ఉత్తీర్ణులయ్యారు.

708 మంది ఏ గ్రేడ్, 530 మంది బీ గ్రేడ్ సాధించారు. నాగార్జునసాగర్, నాగర్‌కర్నూలు, చిట్యాల, ధర్మారం, మహేశ్వరం, కౌడిపల్లి, శాయంపేట స్కూళ్లు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎస్సీ గురుకులాల నుంచి 8,914 మంది విద్యార్థులు హాజరు కాగా 8,022 మంది పాసయ్యారు. ఈ గురుకులాల్లో 29 స్కూళ్లు వంద శాతం, 14 స్కూళ్లు 98 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎస్టీ గురుకుల స్కూళ్ల నుంచి 2,377 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 1,988 మంది పాసయ్యారు. ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల ఆయా గురుకులాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులను మంత్రులు జోగురామన్న, జి.జగదీశ్‌రెడ్డి, అజ్మీరా చందూలాల్ అభినందించారు.   

>
మరిన్ని వార్తలు