నేటి నుంచే హజ్ యాత్ర

25 Sep, 2013 05:15 IST|Sakshi

 సాక్షి, సిటీబ్యూరో: హజ్ యాత్ర 2013 బుధవారం సాయంత్రం షురూ కానుంది. నాంపల్లిలోని హజ్‌హౌస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరే యాత్రికుల బస్సును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తారు. శంషాబాద్ నుంచి జిద్దాకు రాత్రి 8.40 గంటలకు మొదటి విమానంలో 300 మంది, రాత్రి 10.55 గంటలకు రెండో విమానంలో 300 మంది బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హజ్‌యాత్ర కోసం ఈ ఏడాది 50,616 మంది దరఖాస్తు చేసుకోగా... 7658 మంది ఎంపికయ్యారు.
 
 అదేవిధంగా మక్కా మదీనాలో యాత్రికులకు సాయం అందించేందుకు 16 మంది ఖాదీమ్-ఉల్-హుజ్జాజ్ (వాలంటీర్లు) కూడా బయలుదేరి వెళుతున్నారు. దశల వారీగా అక్టోబర్ 9 వరకు 25 విమానాల్లో యాత్రికులు బయలుదేరి వెళతారు. గతేడాది హజ్ కమిటీ ద్వారా సుమారు 7967 మంది హజ్ యాత్ర పూర్తి చేసుకున్నారు. కాగా, హజ్‌హౌస్ మూడో అంతస్తులో బుధవారం విద్యుత్ అంతరా యంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాస్‌పోర్టు తనిఖీలు, ఇమిగ్రేషన్ తదితర కీలక పనులకు ఆటంకం కలిగింది.

మరిన్ని వార్తలు