వారిది బానిస మనస్తత్వం

10 Jul, 2017 01:30 IST|Sakshi
వారిది బానిస మనస్తత్వం

కాంగ్రెస్‌ నాయకులపై హరీశ్‌ ఫైర్‌
►  పులిచింతల కట్టి తెలంగాణను ముంచారు
► 14 వేల ఎకరాలు, 32 గ్రామాలను రోడ్డున పడేశారు
► తెలంగాణలో ఒక్క ఎకరానికి నీరివ్వని ప్రాజెక్ట్‌ కట్టి గొప్పలు చెప్తున్నారు


సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్‌ నాయకుల బానిస మనస్తత్వం లో ఏమాత్రం మార్పు రాలేదని, తెలంగాణను ముంచి, ఆంధ్రకు ప్రయోజనం చేకూర్చిన ప్రాజెక్టు నిర్మాణం తమ ఘనతే అని చెప్పుకో వడం వాళ్ల ఆత్మవంచనకు నిదర్శనమని నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మండిప డ్డారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పులిచిం తల ప్రాజెక్టు నిర్మాణం తమ ఘనతే అని ప్రకటించుకోవడంపై హరీశ్‌ ఆగ్రహం వ్యక్తంచే శారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఉత్తమ్‌ అసమర్థత కు పులిచింతల ఓ నిలువెత్తు నిదర్శనమని, ఆయన సొంత నియోజకవర్గమైన హుజూర్‌ నగర్‌లో 32 గ్రామాలను ముంచి, ఆంధ్రలో మూడో పంటకు ఢోకాలేని విధంగా 45 టీఎంసీల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ కట్టించిన ఘనుడని విమర్శించారు. తెలంగాణలో 14 వేల ఎకరాలను ముంచి, ఇక్కడ ఒక్క ఎకరా నికి కూడా నీళ్లివ్వని పులిచింతల కట్టవద్దని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తాము డిమాండ్‌ చేశామన్నారు. దీనివల్ల తెలంగాణకు నష్టం, ఆంధ్రకు లాభం కలిగిందన్నారు. ఆనాడు ఆంధ్రకు దోచిపెట్టినోళ్లు ఇవాళ చాలా తక్కువ ముంపుతో 50టీఎంసీలతో మల్లన్న సాగర్‌ కడదామంటే గోల చేస్తున్నారన్నారు. మల్లన్నసాగర్‌పై దొంగ సంతకాలతో కేసులు వేసి హైకోర్టునూ మోసం చేస్తున్నారన్నారు.

వాళ్ల నిర్లక్ష్యంతో తెలంగాణకు నష్టం...
పులిచింతల పవర్‌ప్లాంటు కూడా తమ ఘనతే అని ఉత్తమ్‌ చెప్పారని, అయితే దీనివల్ల తెలం గాణకు చేసింది లాభం కాదని, కోలుకోలేని నష్టమని హరీశ్‌రావు విమర్శిం చారు. నిజానికి ఉత్తమ్, అప్పట్లో ఆయన సహచర మంత్రులు చూపిన నిర్లక్ష్యం తెలంగాణకు కోట్లలో నష్టం కలిగించిందన్నారు. 2006లోనే పులిచింతల పవర్‌ ప్లాంటుకు అనుమతి వచ్చిందని, కానీ 2014 జూన్‌ 2 నాటికి అక్కడ ఏ పనీ జరగ లేదని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్మించడంతో మొత్తం వ్యయం తెలంగాణపైనే పడిందన్నారు. ఈ నష్టం మీ నిర్లక్ష్యం ఫలితం కాదా అని మంత్రి ప్రశ్నిం చారు. లోయర్‌ జూరాల కూడా పదేళ్ల క్రితమే పూర్తికావాల్సి ఉందని, అయితే తెలంగాణ కాంగ్రెస్‌ మంత్రుల అసమర్థత వల్ల అది పూర్తి కాలేదని అన్నారు.

సీలేరు కోల్పోయాం...
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిం చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, దీనివల్ల తెలం గాణ సీలేరు పవర్‌ ప్లాంటును కోల్పోవాల్సి వచ్చిందని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచే శారు. ఇక్కడ మనకు రావాల్సిన 460 మెగా వాట్ల విద్యుత్‌ ప్లాంటు ఆంధ్రకు పోయిం దన్నారు. ఏటా దీనివల్ల రాష్ట్రానికి రూ. 300 కోట్ల నష్టంకూడా కాంగ్రెస్‌ నాయకుల ఘనతే అని విమర్షించారు. 2009లో ప్రారంభించిన భూపాలపల్లి రెండో దశ 600 మెగావాట్ల ప్లాంటు కూడా 2014 నాటికి పూర్తి కాలేదని, అది కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాకే పనుల్లో వేగంపెరిగిందని గుర్తుచేశారు. మణు గూరులో పెట్టాల్సిన ప్లాంటును రాయల సీమకు తరలిస్తుంటే అప్పడు ఈ కాంగ్రెస్‌ మంత్రులు మౌనంగా ఉన్నారని, తాము ఎంత ఉద్యమించినా పట్టించుకోలేదని అన్నారు. అలాగే తెలంగాణలో బొగ్గు, నీరు పుష్కలంగా ఉన్నా బొగ్గు లేని విజయవాడలో ప్లాంట్లు పెడితే అప్పుడు ఈ మంత్రులు చూస్తూ ఊరుకుండిపోయారని మండిపడ్డారు.

అడ్డుకోవడమే వారి లక్ష్యం...
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండగా సాగునీటి ప్రాజెక్ట్‌లు, విద్యుత్‌ ప్లాంట్లు కట్టలేదని, కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కడుతుంటే మాత్రం అడ్డుకోవాలని చూస్తు న్నారని హరీశ్‌ ఆరోపించారు. అటు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై 12కేసులు వేశారని, భద్రాద్రి, యాదాద్రి పవర్‌ ప్లాంట్ల మీదా కేసులు వేశారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ సమయంలో రైతులకు 6గంటల కరెంట్‌ కూడా సరిగ్గా సరఫరాచేయలేదని, కానీ తమ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మధ్యాహ్నంపూటే 9 గంటలు సరఫరా చేస్తోందని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి రైతాంగానికి 24 గంటల విద్యుత్‌ అందిస్తామన్నారు.

మరిన్ని వార్తలు