ఏపీ ఎక్కువ నీటిని వాడేస్తోంది

3 Apr, 2018 02:27 IST|Sakshi

కేంద్రానికి మంత్రి హరీశ్‌రావు ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా జలాలను ఎక్కువగా వినియోగిస్తోందని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ ఎక్కువ నీటిని వాడుకుంటోందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి లేఖ రాశారు.

వినియోగించుకున్న నీటి వివరాలను సైతం ఏపీ వెల్లడించడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు సంబంధించి గ్రావిటీపై 55 వేల క్యూసెక్కుల నీటిని వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడును అభివృద్ధి చేసిందని, కానీ కచ్చితమైన నీటి ప్రవాహాన్ని లెక్కించే విధానమేదీ పోతిరెడ్డిపాడు వద్ద లేకపోవడంతో ఏపీ నీటి వాడకం వివాదాస్పదమవుతోందని ఈ లేఖలో మంత్రి ప్రస్తావించారు.  

మరిన్ని వార్తలు