అఆ..వినోద్..ని

12 Dec, 2016 15:21 IST|Sakshi
అఆ..వినోద్..ని
 • చిన్ని తెర హీరో...యిన్
 • ఇప్పటి వరకు 100 గెటప్‌లు
 • కామెడీ షోల్లో అలరిస్తున్న వినోద్
 • అందమైన అమ్మారుు. పెళ్లీడుకొచ్చింది. మంచి పెళ్లి సంబంధం వచ్చింది. ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. కాని వినోదిని మాత్రం చిన్నబుచ్చుకుంది. ఎందుకని? ‘‘నేను మగవాడిని పెళ్లి చేసుకోవడం ఏమిటండీ?’’ అంటూ నవ్వేస్తాడు వినోదిని అలియాస్... వినోద్‌కుమార్. తనను తాను అందమైన అమ్మాయిగా మలచుకుని చిన్నితెర సాక్షిగా నవ్వుల పంట పండిస్తున్న  పరకాయ ప్రవేశం పేరే వినోద్‌కుమార్. మేకప్‌లో బయటకు వస్తే కొర కొర చూసే ఆకతాయిల నుంచి చిలిపి మెసేజ్‌లతో చిరాకు పుట్టించే ఈవ్‌టీజర్ల దాకా ఎదుర్కొంటూ అమ్మాయిగా నటించడం మాత్రమే కాదు జీవిస్తున్న వినోదిని... అమ్మో... నటించడం ఏమో కాని అమ్మాయిగా జీవించడం మాత్రం కష్టమే అంటున్నాడు.
  - బంజారాహిల్స్

  బంజారాహిల్స్ :  అమ్మాయిలకే అసూయ కలిగించేంత అందం.. టీవీ షో కోసం అతడు..ఆమెగా మారాడు. లేడీ గెటప్‌లో వినోద్ కాస్తా వినోదినిగా వినుతికెక్కాడు. హొయలొలికే  వయ్యారంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు. అచ్చం అమ్మాయిలా నటిస్తూ నవ్విస్తున్న వినోద్ అలియాస్ వినోదిని అచ్చూ మన ఇళ్లల్లో ముఖ్యంగా మధ్య తరగతి ఇళ్లల్లో కనిపించే భార్య, తల్లి, ప్రియురాలు, చెల్లి ఇలా అన్ని వేషాల్లోను ఆకట్టుకుంటున్నాడు. ఓ టీవీ చానెల్‌లో వస్తున్న కామెడీ షోలో వినోద్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. కడపకు చెందిన అప్పాయిపల్లి వినోద్‌కుమార్(21) బుల్లితెర నటుడిగా ఎదిగేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. తండ్రి విజయ్‌కుమార్ ప్రభుత్వ ఉద్యోగి కాగా తల్లి శివమణి గృహిణి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నటుడిగా ఎదగాలన్న లక్ష్యంతో కడప నుంచి కృష్ణానగర్‌కు మకాం మార్చాడు.

  2012లో ప్రారంభమైన వినోద్ ప్రస్థానం ఇప్పుడు బుల్లితెరపై అగ్రస్థానానికి చేర్చింది. 2012లో మూవీ ఆడిషన్‌‌సకు వచ్చిన వినోద్ ఓ చిన్న సినిమాలో చిన్న వేషానికి పరిమితమయ్యాడు. అనంతరం మాటీవీలో కెవ్వుకేక షోలో ఆడ గెటప్‌లో ఆకట్టుకున్నాడు. జీ తెలుగులో ఫ్యామిలీ సర్కస్, మరో చానల్‌లో తడాఖా షోలలోనూ లేడీ గెటప్‌లు వేయాల్సి వచ్చింది. ఇక అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. జబర్దస్త్ ప్రోగ్రాం వినోద్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం బుల్లితెరపై లేడీ గెటప్‌లతో వినోద్ విశేషంగా అలరిస్తున్నాడు.

  మ్యారేజ్ ప్రపోజల్స్ చేస్తున్నారు...

  తాను పూర్తిగా లేడీ గెటప్‌లకే పరిమితమయ్యానని, తనను అలా చూడటానికే ఇష్టపడుతున్నారని వినోద్ తెలిపారు. తనకు వినోదిని అనే టైటిల్‌ను కూడా తగిలించారని తెలిపారు. ఇటీవల ఈ అందమైన అమ్మాయిని చేసుకుంటామంటూ తన తల్లిదండ్రులకు మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా పంపించారని, తీరా ‘ఆమె కాదు అతడు’ అని తెలుసుకొని నాలుక కరుచుకున్న సందర్భాలున్నాయన్నారు.

  వెంటపడుతున్నారు...

  చాలా మంది తనను బయట సాధారణ డ్రెస్‌లో ఉన్నప్పుడు గుర్తుపడుతున్నారని, ఆ సమయంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వినోద్ తెలిపారు. ముఖ్యంగా ఆటోల్లో వెళ్తున్నప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని వెల్లడించారు.

  ఇప్పటి వరకు 100 గెటప్‌లు...

  లేడీ గెటప్‌లతో ఇప్పటి వరకు 100 సీన్లు చేశానని తెలిపారు. చాలా మంది టీమ్ లీడర్లు తన హావభావాలు, యువతిగా వేషధారణలు బాగా నచ్చి భార్యగాను, ప్రియురాలిగాను నటించేందుకు పిలుస్తున్నారని చెప్పారు. ధన్‌రాజ్‌తో, చమ్మక్ చంద్రతో చేసిన కాంబినేషన్ బాగా పేరు తీసుకొచ్చాయని వెల్లడించారు.

  మేకప్‌కు గంట సమయం...

  షూటింగ్ ఉన్నప్పుడు లేడీ గెటప్ వేయడానికి సుమారుగా గంట సమయం పడుతున్నదని వినోద్ తెలిపారు. మేకప్‌మెన్లు, హెరుుర్ స్టైలిస్ట్‌లు ఇస్తున్న ప్రోత్సాహంతో తనకు మంచి గెటప్‌లు వస్తున్నాయని చెప్పారు. చీర కట్టుకోవడానికి చాలా సమయం తీసుకుంటున్నదని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మనిషిని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

  చదువుకుంటున్నా..

  ఇంటర్ వరకు కడపలోనే చదువుకున్నానని, ప్రస్తుతం ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎంబీఏ చదువుతున్నానని వెల్లడించారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయని పేర్కొన్నారు.

  మగాడిగా కనిపించడం ఇష్టం లేదు..

  తాను నిజమైన రూపంలో ఎలా ఉంటానో చాలా మందికి తెలియదని, వారందరినీ అదే ఆతృతలో ఉంచాలన్నదే తన ఉద్దేశం అన్నారు. అందుకే తన ఫొటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతుంటానన్నారు. సినిమాల్లో మంచి అవకాశాలు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. తనకు నాగబాబు, రోజాలతో పాటు టీమ్‌లీడర్ల ప్రోత్సాహం బాగా ఉందని అందుకే రాణిస్తున్నానని తెలిపారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యంపై హైకోర్టులో మరో పిటిషన్‌

‘టీడీపీది మేకపోతు గాంభీర్యం’

ఇంటర్‌ బోర్డు ముట్టడికి యత్నించిన వామపక్షాలు

సుప్రీంకోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు షాక్‌!

ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను రప్పించండి

వైద్యం వర్రీ!

చార్మినార్‌.. నో హాకర్స్‌ జోన్‌

విదేశీ నోట గ్రేటర్‌ మాట

ఒక వాహనం.. 73 చలాన్లు

ఇది మల్లెల మాసమనీ..

పెళ్లి చేసుకోవాలని వివాహితకు వేధింపులు

ప్రియురాలు మాట్లాడటం లేదని ఓ మైనర్‌..

జల్సాలు చేసేందుకే చోరీలు

వ్యాపారి దారుణ హత్య

పది నిమిషాల్లోనే కిడ్నాపర్ల ఆటకట్టు

సినిమా ప్రేక్షకులతో అసభ్య ప్రవర్తన

ఆడుకుంటూ బాలుడి మృతి.. వీడియో వైరల్‌ 

గుండె గూటిలో నిండు ప్రేమ!

ధర్నాకు అనుమతినిచ్చేలా పోలీసుల్ని ఆదేశించండి 

‘క్రిమినల్‌ చర్యలు ఎంతవరకు వచ్చాయి?’

తొలి విడత జెడ్పీటీసీలకు 2,104 నామినేషన్లు

ప్రభుత్వ వాహనాలను వాడొద్దు..

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నారు

గులాబీ దళానికి 18 ఏళ్లు 

ప్రధాని మోదీపై పోటీకి సై

మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్‌ చేయాలి

నెక్ట్స్‌.. బాహుబలే

అక్రమాలకు ‘పదోన్నతి’!

బోర్డు రద్దు యోచన సమర్థనీయం కాదు

చక్రం తిరుగుతోంది చందాలతోనే..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గూగుల్‌లో థానోస్‌ అని సెర్చ్‌ చేస్తే ఏమౌతుందో తెలుసా?

వంద కోట్లు కలెక్ట్‌ చేసిన ‘కాంచన3’

‘మా ఏపీ’లోకి తెలంగాణ, చెన్నై టెక్నీషియన్లు

ఎన్నికల్లో మార్పు రావాలి

ఓట్లేసిన తారలకు పాట్లు

సినీ రంగానికి నూతన ఆర్టిస్టులు అవసరం