వాన.. హైరానా

31 Jul, 2016 05:27 IST|Sakshi
వాన.. హైరానా

నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
మల్కాజ్‌గిరిలో అత్యధికంగా 6.6 సెం.మీ.
 వర్షపాతం
 
హైదరాబాద్
: అల్పపీడన ద్రోణి ప్రభావంతో గ్రేటర్ పరిధిలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి పొద్దుపోయే వరకు పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది.

అత్యధికంగా మల్కాజ్‌గిరిలో 6.6 సెం.మీ. రికార్డు వర్షపాతం నమోదైంది. సరూర్‌నగర్‌లో 6 సెం.మీ. కుండపోత వర్షం కురిసింది. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు ప్రధాన రహదారులపై మోకాళ్లలోతున వరదనీరు పోటెత్తి ట్రాఫిక్ స్తంభించింది. పలు చోట్ల 2 నుంచి 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి నాలాలు పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ నరకంలో చిక్కుకొని వాహనదారులు,ప్రయాణీకులు విలవిల్లాడారు. రాత్రిపొద్దుపోయాక ఇళ్లకు చేరుకోవాల్సి వచ్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలో జనజీవనం స్తంభించింది.
 
ఆయా ప్రాంతాల్లో శనివారం రాత్రి 8 గంటల వరకు నమోదైన వర్షపాతం ఇలా ఉంది.
 ప్రాంతం            వర్షపాతం సెం.మీ.ల్లో
 మల్కాజ్‌గిరి            6.6
 సరూర్‌నగర్            6.0
 కుత్బుల్లాపూర్        5.1
 జీడిమెట్ల                4.8
 తిరుమలగిరి           4.8
 కాప్రా                     3.7
 వెస్ట్‌మారేడ్‌పల్లి        3.1
 శివరాంపల్లి             3.0
 మల్కాపూర్           2.5
 బండ్లగూడ             2.3
 సర్దార్ మహల్        1.8

మరిన్ని వార్తలు