హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

8 Jun, 2017 08:54 IST|Sakshi

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో గురువారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లు వర్షం నీటితో నిండిపోయాయి. దీంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.  వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.మరోవైపు లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

 

మరిన్ని వార్తలు