హెర్నియా ఆపరేషన్‌కు వస్తే ప్రాణాలే తీశారు

1 Jul, 2017 00:08 IST|Sakshi
హెర్నియా ఆపరేషన్‌కు వస్తే ప్రాణాలే తీశారు

మత్తుమందు ఎక్కువై చిన్నారి మృతి
పోలీసులకు ఫిర్యాదు


రాంగోపాల్‌పేట్‌:  హెర్నియాతో బాధపడుతున్న చిన్నారిని ఆసుపత్రికి తీసుకురాగా నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన సం ఘటన రసూల్‌పుర చౌరస్తా సమీపంలోని అంకుర ఉమెన్స్, చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  ములుగుకు చెందిన జగదీశ్, పల్లవి దంపతుల కుమారుడు అనిర్పన్‌ (18 నెలలు)కు హెర్నియాతో బాధపడుతుండటంతో వరంగల్‌లోని ఓ ఆస్పత్రిలో చూపించారు. శస్త్ర చికిత్స చేయించాల్సి ఉంటుందని వారు చెప్పడంతో ఈ నెల 24న ఉప్పల్‌లోని అంకుర ఆస్పత్రిలో డాక్టర్‌ కరుణ సాగర్‌కు చూపించారు.

బాబుకు శస్త్ర చికిత్స చేయాలని చెప్పడంతో వారు అంగీకరించారు. అదే రోజు మధ్యాహ్నం 1గంటకు ఆపరేషన్‌ ధియేటర్‌లోకి తీసుకుని వెళ్లిన వైద్యులు 2.30గంటల  తర్వాత బయటికి వచ్చి కొద్దిగా మత్తులో ఉన్నాడని ఐసీయూలో ఉంచినట్లు తెలిపారు.  తెల్లవారిన తర్వాత బాబు మెలకువలోకి రాగా, మత్తు ఎక్కువ అయిందని కళ్లు, కాళ్లకు ఇబ్బంది ఏర్పడిందని ప్రాణాలకు ముప్పులేదని చెప్పారు. అటు తర్వాత సీటీ, స్కాన్, ఎంఆర్‌ఐ తీసి పరిస్థితి విషమంగా ఉందని చెప్పి ఈ నెల 27న ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రికి బాబు చనిపోయినట్లు చెప్పడంతో రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.

మరిన్ని వార్తలు