పర్యావరణ అనుమతులు రాకుండా టెండర్లా?

9 Aug, 2017 00:40 IST|Sakshi
మల్లన్నసాగర్‌పై హైకోర్టు 
 
సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు రాకుండానే టెండర్లు పిలవడంపై హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అనుమతులు రానప్పుడు టెండర్‌ నోటిఫికేషన్‌ ఎలా జారీ చేస్తారో చెప్పాలని  ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు.

పర్యావరణ అనుమతులు లేకుండా మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రభుత్వం టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిందని, ఇది చట్ట విరుద్ధమంటూ వేములఘాట్‌కు చెందిన గండ్ల లక్ష్మి, మరో ఐదుగురు వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది సీహెచ్‌ రవికుమార్‌ వాదనలు వినిపించారు. 
మరిన్ని వార్తలు