వీసీ ఏవిధంగా ఏ1 అవుతారు: హైకోర్టు

6 Apr, 2016 12:16 IST|Sakshi
వీసీ ఏవిధంగా ఏ1 అవుతారు: హైకోర్టు

హైదరాబాద్ : హెచ్సీయూ పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. వేముల రోహిత్ ఎఫ్ఐఆర్ ఆధారంగా వీసీ అప్పారావును తొలగించాలన్న పిటిషనర్ వాదనపై  హైకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా వీసీ ఏవిధంగా A1 అవుతారని హైకోర్టు ప్రశ్నించింది. మనోభావాల ఆధారంగా విచారణ జరపలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం వీసీనీ ఏవిధంగా తొలగించాలో చెప్పాలని తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి సోమవారం విచారణకు రావాలని కోర్టు సూచించింది. వీసీతో పాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను కూడా ఆయా పదవుల నుంచి తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ స్టాండింగ్ కౌన్సిల్ దామోదర్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

కాగా  కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇచ్చిన లేఖ వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని హెచ్సీయూ విద్యార్థులు  గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అలాగే వైస్ ఛాన్సులర్ అప్పారావుపై కూడా కేసు నమోదు అయింది.  ఏ1 వీసీ అప్పారావు, ఏ2 బండారు దత్తాత్రేయ, ఏ3 సుశీల్ కుమార్, ఏ4 విష్ణుపై  సెక్షన్ 306 కింద  కేసు నమోదు అయ్యాయి.

మరిన్ని వార్తలు