సినిమా టికెట్ల ధరలు ఎప్పుడు ఖరారు చేస్తారు

29 Dec, 2017 02:37 IST|Sakshi

తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు హైకోర్టు ప్రశ్న

సాక్షి, హైదరాబాద్‌: సినిమా టికెట్ల ధరల విషయంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న నాన్చుడు వైఖరిని హైకోర్టు తప్పుపట్టింది. నిర్దిష్టమైన మార్గదర్శకాలతో, ఏయే కేటగిరీకి ఎంత ధర ఖరారు చేస్తున్నారో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఇరు ప్రభుత్వాలకు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సినిమా హాళ్లలో టికెట్‌ ధరల పెంపుకోసం తాము పెట్టుకున్న దరఖాస్తుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవట్లేదని, కొత్త జీవో జారీ చేసేంత వరకు దరఖాస్తులో పేర్కొన్నట్లు టికెట్‌ ధరలను వసూ లు చేసుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఇరు రాష్ట్రాల్లోని పలు సిని మా హాళ్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యా జ్యాలపై గురువారం న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌. వి.భట్‌ మరోసారి విచారించారు.

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. సినిమా థియేటర్లలో టికెట్‌ ధరల సవరణకు సంబంధించి 2013లో జారీ చేసిన జీవో 100ను హైకోర్టు కొట్టేసిందన్నారు. ఇరు రాష్ట్రాల్లో ఉన్న సినిమా హాళ్లలో టికెట్‌ ధరలను నిర్ణయించేందుకు హోం శాఖ ముఖ్యకార్యదర్శుల అధ్యక్షతన కమిటీల ను ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించిందన్నారు. ధరలను నిర్ణయించేటప్పుడు ప్రేక్షకుల ప్రయోజనాలతో పాటు ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని కమిటీలకు హైకోర్టు స్పష్టం చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో 2017 మార్చి 30 లోపు తగిన మార్గదర్శకాలను రూపొందించాలని కమిటీలకు తేల్చి చెప్పింద న్నారు. ఏపీ ప్రభు త్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, త్వరలో నే టిక్కెట్ల ధరల పెంపు విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు