కోఠి ప్రసూతి ఆస్పత్రిపై హైకోర్టు ఆగ్రహం

14 Jun, 2016 17:54 IST|Sakshi

హైదరాబాద్: కోఠి ప్రసూతి ఆస్పత్రి పరిస్థితులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్పత్రిలోని అసౌకర్యాలపై సుమోటోగా ఫిర్యాదు స్వీకరించిన న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఆస్పత్రిలో అపరిశుభ్ర వాతావరణం, అరకొర వసతులు, నిర్వహణ లోపం రోగులకు తీవ్ర ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయని పేర్కొంది. అక్కడి పరిస్థితులపై మూడు వారాల్లోగా సవివర నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ ఇద్దరు మహిళా న్యాయవాదులతో కమిటీని ఏర్పాటు చేసింది.

మరిన్ని వార్తలు