ప్రత్యూష కేసు విచారణ వాయిదా

20 Jul, 2015 11:54 IST|Sakshi
ప్రత్యూష కేసు విచారణ వాయిదా

హైదరాబాద్: కన్నతండ్రి, పిన్ని చేతిలో చిత్రహింసలు భరించి కోలుకున్న ప్రత్యూష ఆరోగ్యంపై డాక్టర్లు ఇచ్చిన నివేదికను హైకోర్టుకు ఎల్బీ నగర్ పోలీసులు సమర్పించారు. ప్రత్యూష ఆరోగ్య కారణాలను దృష్టిలో విచారణను వచ్చే సోమవారంకు కోర్టు వాయిదా వేసింది. చదువు మధ్యలో ఆపేసి గృహహింసకు గురౌవుతున్నవారి సంఖ్య తెలపాలని రెండు రాష్ట్రాల అడ్వేకేట్ జనరల్స్ ను హైకోర్టు ఆదేశించింది. ఏపీ సర్కారును సైతం ఈ కేసులో ప్రతివాదిగా చేర్చింది.

ప్రభుత్వ నిధులు బాధితులకు అందకుండా దుర్వినియోగం అవుతున్నాయని, ఆర్టికల్ 14 ఉల్లంఘన జరుగుతోందని హైకోర్టు పేర్కొంది. కాగా ప్రత్యూష రక్షణ బాధ్యత తీసుకుంటామని హైకోర్టును అవేర్ ఫౌండేషన్ ఆశ్రయించింది. ప్రత్యూష లాంటి 14 మంది బాలికలు తమ సంరక్షణలో ఉన్నారని న్యాయస్థానానికి తెలిపింది.

మరిన్ని వార్తలు