'కోర్టు ధిక్కరణ నోటీసులు స్వీకరించలేదు'

22 Mar, 2016 19:29 IST|Sakshi

హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కేసులో కోర్టు ధిక్కరణ నోటీసులు స్వీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి స్టాండింగ్ కౌన్సిల్ నిరాకరించింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రోజా తరఫు న్యాయవాది తెలిపారు. అయితే నోటీసులు స్వీకరించవద్దంటూ తమకు ఆదేశాలు ఉన్నాయని అసెంబ్లీ కార్యదర్శి స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు చెబుతున్నారు.

రోజాను అసెంబ్లీకి అనుమతించాలంటూ ఈ నెల 17న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని లాయర్ గుర్తుచేశారు. నేరుగా మెయిల్ ద్వారా శాసనసభ కార్యదర్శికి కోర్టు ఈ వివరాలు పంపినట్లు వెల్లడించారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత వాటిని అమలు చేసిఉంటే రోజా సభకు హాజరయ్యేవారని, అయితే అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు. కనీసం ధిక్కరణ పిటిషన్ కు సంబంధించిన నోటీసులు కూడా స్వీకరించలేదని రోజా తరఫు న్యాయవాది వివరించారు.

మరిన్ని వార్తలు