కోతల వేళల్లో మార్పు

23 Feb, 2014 00:43 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ సరఫరాలో సర్దుబాటు కోసం ఆదివారం నుంచి గ్రేట ర్ పరిధిలోని అధికారిక విద్యుత్ కోతల వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్టు సీపీడీసీఎల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
     
 గుడిమల్కాపూర్, ఏసీగాడ్స్, ఆసిఫ్‌నగర్, గోల్కొండ, లంగర్‌హౌస్, టోలిచౌకి, మోతీ మహల్, నాంపల్లి, సరోజినీదేవి ఆస్పత్రి 33/11కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో ఉదయం 6-7, తిరిగి ఉదయం 10-11 గంటల మధ్య విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు.
     
 సీఆర్‌పీఎఫ్, చందులాల్ బారాదరి, ఫలక్‌నుమా, కందికల్‌గేట్, కిలావత్, మీరాలం, పేట్లబురుజు, సాలార్జంగ్ మ్యూజియం, అత్తాపూర్ పరిధిలో ఉదయం 7-8, తిరిగి 11-12 గంటల మధ్య సరఫరా ఉండదు.
     
 ఎర్రమంజిల్, ఇందిరాపార్క్, జవహర్‌నగర్, హైదర్‌గూడ, లేక్‌వ్యూ, హుస్సేన్‌సాగర్, లుంబినీ పార్క్, ఎగ్జిబిషన్, పబ్లిక్‌గార్డెన్‌లో ఉదయం 8  -9, తిరిగి మధ్యాహ్నం 12-1 గంట మధ్య కరెంట్ ఉండదు.
     
 జేమ్స్ స్ట్రీట్, క్లాక్ టవర్, బన్సీలాల్‌పేట, కిమ్స్, మోండా మార్కెట్, పాటిగడ్డ, మారేడుపల్లి, జింఖానా, అడ్డగుట్ట, హైదర్‌గూడ, నెహ్రూనగర్, సీతాఫల్‌మండి, చిలుకలగూడ, లాలాగూడ, ఐఐసీటీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఉదయం 9-10, తిరిగి మధ్యాహ్నం 1-2 గంటల మధ్య విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు.
 

మరిన్ని వార్తలు