కోస్తాంధ్ర, తెలంగాణలో అతిభారీ వర్షాలు

1 Jul, 2016 08:14 IST|Sakshi

హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో ఖమ్మం జిల్లా పలుప్రాంతాలు.. ములకలపల్లిలో 17 సెం.మీ, టేకులపల్లిలో 14, చంద్రగొండలో 11.8, బయ్యారంలో 10.9 సెం.మీ నమోదైన వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాలో మొగుళ్లపల్లిలో 13 సెం.మీ, గోవిందరావుపేట 13 సెం.మీ, వెంకటాపూర్ 12.9 సెం.మీ వర్షపాతం నమోదైంది.

కాగా, ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో 3.6 సెం.మీ, విజయనగరంలో 3.3 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, తూర్పుగోదావరి జిల్లాలో 2.3 సెం.మీ, కృష్ణా జిల్లాలో 2.1 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు