నగరంలో హోరువాన

28 May, 2017 01:34 IST|Sakshi
నగరంలో హోరువాన

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని నగరంలో శనివారం రాత్రి పలు చోట్ల హోరున వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. పంజగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అబిడ్స్, కోఠి, తార్నాక, సికింద్రాబాద్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.

దీంతో వీకెండ్‌ కాలక్షేపం కోసం బయటకు వచ్చిన నగరవాసులు తిరిగి ఇళ్లకు వెళ్లే సమయంలో ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు సైతం అంతరాయం కలిగింది. ఉరుములు, మెరుపులు, గాలి కారణంగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.

మరిన్ని వార్తలు