భారీగా వెండి ఆభరణాలతో వ్యక్తి పట్టివేత

4 Nov, 2015 20:03 IST|Sakshi

సికింద్రాబాద్: భారీగా వెండి ఆభరణాలను రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌కు వచ్చిన కె.శ్రీను అనే వ్యక్తిని పోలీసులు తనిఖీ చేశారు. అతడి వద్ద 28.7 కిలోల వెండి ఆభరణాలను గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడంతో అతడ్ని అదుపులోకి తీసుకుని వాణిజ్య శాఖ అధికారులకు అప్పగించారు.
 

మరిన్ని వార్తలు