ధర్నా చౌక్‌ను పునరుద్ధరించాలి

16 Apr, 2017 02:56 IST|Sakshi
ధర్నా చౌక్‌ను పునరుద్ధరించాలి

వామపక్షాలు, ప్రజాసంఘాల డిమాండ్‌
రిలే దీక్షలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్‌: ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ను పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంట నే నిర్ణయం తీసుకోవాలని వామపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి. ఎట్టి పరి స్థితుల్లోనూ ధర్నా చౌక్‌ను పరిరక్షించుకుంటా మని, ఇందుకోసం దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించాయి. ప్రజాస్వా మ్య హక్కుల పరిరక్షణ, నిరసన తెలిపే హక్కు కోసం కలిసొచ్చే శక్తులు, ప్రజాసంఘాలు, మేధావులను కలుపుకుని వివిధ రూపాల్లో ఆందోళనలను తీవ్రం చేస్తామని హెచ్చరించా యి. నెల రోజులు రిలే దీక్షలను నిర్వ హించి, మే 15న ఇందిరాపార్కు ఆక్రమణ, రాష్ట్రవ్యాప్త చలో ధర్నాచౌక్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపాయి.

ధర్నాచౌక్‌ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా శనివారం మగ్దూంభవన్ లో చాడ వెంకటరెడ్డి, గుండా మల్లేశ్, ఆదిరెడ్డి, ఈర్ల నర్సింహా(సీపీఐ), తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, డీజీ నరసింహారావు (సీపీఎం), సాదినేని వెంకటేశ్వరరావు, గోవర్ధన్(న్యూడెమోక్రసీ–చంద్రన్న), వెంకట రామయ్య, పోటు రంగారావు (న్యూ డెమోక్రసీ–రాయల),తాండ్రకుమార్‌ (ఎంసీపీ ఐ–యూ), మురహరి (ఎస్‌యూసీఐ–సీ), జానకిరాములు (ఆర్‌ఎస్‌పీ), ప్రకాశ్‌ (ఆప్‌), రాజేశ్‌(న్యూ లిబరేషన్), వెంకటరెడ్డి (టీజేఏసీ),రవిచంద్ర(టీడీఎఫ్‌), కె.సజయతో కలిపి మొత్తం 50 మందితో తొలిరోజు రిలే దీక్షలను విద్యావేత్త చుక్కా రామయ్య ప్రారం భించారు. దీక్షలో ఉన్న వారికి సాయంత్రం నిమ్మ రసం ఇచ్చి టీజేఏసీ చైర్మన్ కోదండరాం విరమింపజేశారు.

ప్రజాస్వామ్యం కోసం కలసిరావాలి
ప్రజాస్వామ్య హక్కుల కోసం ధర్నాచౌక్‌ పరిర క్షణ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని కోదండరాం పిలుపునిచ్చారు. నెల రోజులపాటు సాగే ఈ దీక్షలో పాల్గొని, సంఘీభావం తెలపవచ్చన్నారు. ప్రజాస్వా మ్యాన్ని బతికించుకోవాల్సి ఉందని, ధర్నా చౌక్‌ వంటిది ఉనికిలో లేకపోతే ప్రజాస్వా మ్యానికి ఉరి వేసినట్లేనన్నారు. గద్దెను ఎక్కగానే సీఎం కేసీఆర్‌ ధర్నా చౌక్‌ను మరిచి పోవడం భావ్యం కాదని చుక్కా రామయ్య విమర్శించారు.

నిన్నటివరకు ప్రజాస్వామ్య యుతంగా పార్టీలో పనిచేసిన కేసీఆర్‌కు ప్రశ్నించే దీపాన్ని ఆర్పివేసే హక్కు లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించుకుని ధర్నా చౌక్‌ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ గొంతుకను నులిమే శక్తి ఏ ప్రభు త్వానికి, ఏ పార్టీకి లేదని ప్రొ.రమా మేల్కొటె అన్నారు. ప్రధాని మోదీకి రెండు కళ్లు మాదిరిగా చంద్రబాబు, కేసీఆర్‌ వ్యవహరిస్తు న్నారని విరసం నేత వరవరరావు ధ్వజమెత్తారు.

ఏపీలో నిషేధిత సంస్థ అయిన రెవెల్యూ షనరీ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ప్రకటించా రు. నిరసన తెలపడమనేది ప్రకృతి సిద్ధమైన, నైసర్గిక హక్కుని, రాచరికంలో, ఫ్యూడల్‌ వ్యవస్థలోనూ ధర్మగంట పెట్టి ఆపదలో ఉన్న వారు రాజు తలుపుతట్టే వీలుంటుందని చె ప్పారు. నిరసనలు లేకుండా, ప్రతిపక్షాలు లేకుండా చేయాలని సామ, దాన, భేద, దండోపాయాలను పాలకులు ప్రయో గిస్తున్నారని తమ్మినేని వీరభద్రం ధ్వజమె త్తారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలేవీ అమలు కావడం లేదని, ప్రశ్నించే గొంతులను, హక్కులను హరిస్తారా అని చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు