హైదరాబాద్-నిజమాబాద్ జర్నీ బిల్లు 9 లక్షలు

3 Sep, 2016 12:42 IST|Sakshi
హైదరాబాద్-నిజమాబాద్ జర్నీ బిల్లు 9 లక్షలు

ఓలా క్యాబ్ లో జర్నీ చేసిన ప్యాసింజర్ బిల్లు చూసి అవాక్కయ్యాడు. వేలల్లో రావాల్సిన బిల్లు లక్షల్లో రావడంతో పేమెంట్ చేయనని తేల్చేశాడు. దీంతో దిగొచ్చిన ఓలా సిబ్బంది సవరించిన బిల్లును పే చేయాల్సి వచ్చింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. రతీష్ శేఖర్ ప్రభుత్వ పనులపై ప్రైవేట్ కన్సల్టెంట్ గా హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. ఆగస్టు 24న హైదరాబాద్ నుంచి నిజమాబాద్ వెళ్లాడు. ఆ రోజు ఉదయం 8గంటలకు జూబ్లీహిల్స్ లో ఓలా క్యాబ్ లో బయలుదేరిన ఆయన నిజమాబాద్ లో పని ముగించుకుని తిరిగి అదేరోజు సాయంత్రం 5:15కి హైదరాబాద్ వచ్చేశాడు.

బిల్లు ఎంత అని చూడగా మీటర్ రీడింగ్ రూ.9.15(9,15,887)లక్షల బిల్లు చూపించింది. బిల్లు చూసిన కస్టమర్ రతీష్ శేఖర్ తో పాటు క్యాబ్ డ్రైవర్ సునీల్ కుమార్ షాక్ తిన్నాడు. మొదటగా ఆయన ఎస్టిమేటెట్ బిల్లు చూడగా రూ.5వేలు అని వచ్చిందని, అయితే జర్నీ తర్వాత 9లక్షలు రావడంపై షాక్ తిన్నాడు. ఈ ధరతో రెండు ఇండికా కార్లు కొనుక్కోవచ్చునని తెలిపాడు. ప్రయాణించిన దూరం 450 కిలోమీటర్లు కాగా, మీటర్ రీడింగ్ మాత్రం 85,427కి.మీ అని చూపించింది. ఓలా క్యాబ్ డ్రైవర్ ను ప్రశ్నించగా, దాదాపు అరగంట సమయం తీసుకున్న డ్రైవర్ అతడిని సముదాయించే యత్నం చేశాడు.

మీటర్ రీడింగ్ లో డాట్(.) పడలేదని వాస్తవానికి బిల్లు 9157 వచ్చిందని, డాట్ లేకపోవడంతో 9,15,887 అని కంగారుపడ్డారని సర్దిచెప్పాడు. బిల్లు చెల్లించేందుకు శేఖర్ నిరాకరించగా, ఓలా సిబ్బందికి కాల్ చేశాడు. వారు ఫైనల్ గా బిల్లు రూ.4,812 రూపాయలు చెల్లించాలని సూచించారు. ఆ డబ్బులు చెల్లించి రతీష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయంపై ఓలా ప్రతినిధిని సౌమిత్ర చంద్ ను ప్రశ్నించగా, కంప్యూటర్ లో సాంకేతిక కారణంగా ఈ తప్పిదం జరిగిందని చెప్పి క్షమాపణ కోరారు. ఇక ముందు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామన్నారు.

మరిన్ని వార్తలు