క్షణ క్షణం

23 Mar, 2016 02:30 IST|Sakshi
క్షణ క్షణం

హైదరాబాద్ యూనివర్సిటీ వీసీగా అప్పారావు బాధ్యతలు చేపట్టడం అత్యంత గోప్యంగా, ప్రణాళికాబద్ధంగా సాగిపోయింది. విద్యార్థులకు, ఫ్యాకల్టీకి ఏమాత్రం అనుమానం రాకుండా తంతు కానిచ్చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ విద్యార్థులు ఆందోళనకు దిగితే... కట్టడి చేసేందుకు వీలుగా పోలీసులకు ముందే సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం చోటు చేసుకున్న పరిణామాల క్రమాన్ని ఒక్కసారి పరిశీలిస్తే...

ఉదయం 8 గంటలకు గచ్చిబౌలి స్టేడి యానికి వీసీ  అప్పారావు చేరుకున్నారు. 8.05 గంటలకు లైఫ్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజ గోపాల్, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రకాశ్‌బాబు, మేనేజ్‌మెంట్ స్టడీస్ డీన్ రాజశేఖర్‌తో పాటు కొందరు ప్రొఫెసర్లు అక్కడే అప్పారావును కలుసుకున్నారు. 8.15 గంటలకు నాన్ టీచింగ్ స్టాఫ్‌కు సమాచారం.   8.30: అనుకున్నట్లుగానే వర్సిటీకి తన కుటుంబసభ్యులతో చేరుకున్న అప్పారావు వీసీగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం వీసీ లాడ్జీ దగ్గర సమావేశం కావడానికి 150 కుర్చీలు, టెంట్ వే యడానికి ఏర్పాట్లు చేశారు.  9 గంటలకు అప్పారావు వర్సిటీలోని వీసీ లాడ్జీకి చేరుకునేలా సిబ్బందికి రాజగోపాల్ సూచించారు. 9.15: 9.30 గంటలకల్లా వీసీ లాడ్జీ వద్దకు క్రమశిక్షణ సంఘం చైర్మన్ అలోక్ పాండే తదితరులు చేరుకునేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అదే సమయానికి లైఫ్‌సెన్సైస్ విద్యార్థులు అక్కడికి చేరుకుని వీసీకి శుభాకాంక్షలు తెలిపారు. 10.00: వీసీ వచ్చిన విషయుం తెలుసుకున్న విద్యార్థులు వీసీలాడ్జ్ వద్దకు చేరుకున్నారు. లోనికి వెళ్లి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
     
10.45: పోలీసులు రంగప్రవేశం..విద్యార్థులను చెదరగొట్టారు.  11.15 : వీసీ లాడ్జ్ వుుందు విద్యార్థులు ధర్నా..వీసీ ఉన్న గదిలోకి వెళ్లేందుకు యుత్నం..అడ్డుకున్న పోలీసులు12.00 : వీసీకి వుద్దతుగా నాన్‌టీచింగ్ సిబ్బంది ఆందోళన.. వారిని అడ్డుకున్న విద్యార్థులు.. సా 5.30 : వీసీ చాంబర్ వెనుక విద్యార్థులు ఆందోళన..  స్పెషల్ బెటాలియున్ పోలీసులు రాక.. విద్యార్థులపై లాఠీచార్జి..పరిస్థితి ఉద్రిక్తం రాత్రి 8.00: యుూనివర్శిటీ గేట్ల వుూసివేత..వర్శిటీని స్వాధీనం చేసుకున్న పోలీసులు
 

మరిన్ని వార్తలు