లంగర్హౌస్లో కార్డన్ సెర్చ్: 63 మంది అరెస్ట్

26 Mar, 2016 08:23 IST|Sakshi

హైదరాబాద్ : నగరంలోని లంగర్హౌస్, గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 63 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అలాగే సరైన పత్రాలు లేని 59 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 200 మంది పోలీసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు