జీహెచ్ఎంసీ మేయర్‌కు ఈ-చలానా

31 Mar, 2016 17:46 IST|Sakshi
జీహెచ్ఎంసీ మేయర్‌కు ఈ-చలానా

హైదరాబాద్ : హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడుపుతున్నవారిపై కొరడా ఝళిపిస్తున్న పోలీసులు.. రూల్స్ అతిక్రమిస్తే  ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదనే చందంగా వ్యవహరిస్తున్నారు. శిరస్త్రాణం లేకుండా వాహనం నడిపిన నగర మేయర్‌ బొంతు రామ్మోహన్ కు ఈ-చలాన్లు పంపి తమ వృత్తి ధర్మం నిర్వర్తించారు. నగరంలోని పారిశుద్ధ్య పనులు పరిశీలించడానికి అర్ధరాత్రి వేళ హెల్మెట్ లేకుండా బైక్‌పై పర్యటించిన నగర మేయర్ బొంతు రామ్మోహన్‌కు గురువారం ట్రాఫిక్ పోలీసులు ఈ-చలాన్లు పంపారు.

అయితే గ్రేటర్ ప్రథమ పౌరుడు ఆక‌స్మిక త‌నిఖీల పేరిట హెల్మెట్ లేకుండా బైక్పై ప్రయాణించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అంతే నెటిజన్లు తమ ప్రతాపం చూపించారు. సామాన్యుడికి ఓ రూల్, మేయర్కు మరో రూలా అంటూ విమర్శలు గుప్పించటంతో... ఎట్టకేలకు పోలీసులు...మేయర్ ఇంటికి  ఈ-చలానా పంపించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు