నగరంలో ఈ వీకెండ్ ఏం జరుగుతోంది..

30 Oct, 2015 12:12 IST|Sakshi

వారమంతా బిజీబిజీ పనులతో సతమతమయ్యే నగర వాసులకు ఈ వీకెండ్ ఉత్సాహాన్ని అందించనుంది. హైదరాబాద్ నగరంలో ఈ వారంతంలో ఎన్నో ఆహ్లాదభరిత కార్యక్రమాలు మీ ముందుకొస్తున్నాయి. ఒక్కసారి ఏదో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారంటే మనసుకు ప్రశాంతత చేకూరి సేదతీరవచ్చు. ఒక్కసారి ఈ వీకెండ్కు సంబంధించిన ఆ ఈవెంట్స్ ఇలా ఉన్నాయి...

ఉత్సాహంగా, ఉల్లాసంగా:
హ్యాపీ స్ట్రీట్స్:  డ్యాన్సింగ్, స్కేటింగ్, సైక్లింగ్, జుంబా డాన్స్లతో వీధులు ఆహ్లాదకరంగా మారనున్నాయి. సైబారాబాద్ పోలీస్ విభాగం ఆదివారం నాడు ఈ ఈవెంట్ నిర్వహిస్తోంది.
స్థలం: నేరేడ్మెట్ క్రాస్ రోడ్స్
సమయం: నవంబర్ 1, ఉదయం 6-9 గంటలు

స్పేసెస్: నగరంలోని చారిత్రక స్థలాలపై నాటక ప్రదర్శన. మహమ్మద్ అలీ బేగ్ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ స్టోరీ ఫిల్మ్ నగరం చరిత్ర, వారసత్వ సంపదను తెలుపుతుంది.
స్థలం: రవీంద్రభారతి, అసెంబ్లీ దగ్గర
సమయం: అక్టోబర్ 30, రాత్రి 7:30 గంటలకు


ఏ ఫ్రెండ్స్ స్టోరీ: ప్రేమకథ ప్రదర్శన. విజయ్ టెండూలర్కర్ రచించిన ఈ కథకు ఆకాశ్ ఖురానా దర్శకత్వం వహించాడు. ప్రేమ, ద్వేషం, అసూయ లాంటి అంశాలను ఇందులో చూపిస్తారు.
స్థలం: రవీంద్రభారతి, అసెంబ్లీ దగ్గర
సమయం: నవంబర్ 1, రాత్రి 7:30 గంటలకు

డోపెహ్రి: టీవీ, సినీనటుడు పంకజ్ కపూర్ రచించిన కథను ప్లే చేస్తారు. చిన్నప్పటి నుంచి 60 ఏళ్ల వరకు ఓ మహిళ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొందో పంకజ్ ఇందులో చూపిస్తాడు.
స్థలం: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(ఆడిటోరియం), సైబర్ టవర్స్ దగ్గర, మాదాపూర్
సమయం: అక్టోబర్ 31, రాత్రి 7:30 గంటలకు ప్రారంభం

డబుల్ బిల్: 'ది బియర్ అండ్ ద ప్రపోజల్' ప్రదర్శన
ఆర్మీకి చెందిన యువ లెఫ్టినెంట్ ఓ యువతితో ప్రేమలో పడటం. వారిద్దరి ప్రేమ కోసం వారి కుటుంబాలు శత్రుత్వాన్ని వదలడం.
స్థలం: గ్రీన్ గాబుల్స్ ఇంటర్నేషనల్ స్కూల్, సీజీఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్
సమయం: అక్టోబర్ 31, రాత్రి 7:30 గంటలకు ప్రారంభం

యాదోంకి బుజే హుయే సవేరే: ఉమా ఝుంజున్ వాలా దర్శకత్వం వహించిన ఈ నాటకం మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన చివరి రోజుల్లో తాజ్మహల్ వద్ద గడిపిన సంఘటనలు.
స్థలం: ధారుల్ షిఫా రోడ్, అఫ్జల్గంజ్, సాలార్ జంగ్ మ్యూజియం
సమయం: నవంబర్ 2, రాత్రి 7:30 గంటలకు ప్రారంభం

ఫ్లూయిడ్ యాక్ట్స్ ఆఫ్ డివియేషన్: జర్మనీకి చెందిన విక్టోరియా హుక్ కొరియోగ్రఫీ చేసిన ఈ ఈవెంట్ను ఇద్దరు డ్యాన్సర్స్ ప్రదర్శిస్తారు. ఫిజికల్, ఎమోషనల్ సెన్సెషన్స్ ఇందులో కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రదర్శన.
స్థలం: ధారుల్ షిఫా రోడ్, అఫ్జల్గంజ్, సాలార్ జంగ్ మ్యూజియం
సమయం: నవంబర్ 3, సాయంత్రం 6 గంటలకు

అంకుల్ వన్య: నాగ్పూర్ ఫిల్మ్ విభాగం ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఓ చిన్నారి దత్తతపై ప్రదర్శన.  
స్థలం: ధారుల్ షిఫా రోడ్, అఫ్జల్గంజ్, సాలార్ జంగ్ మ్యూజియం
సమయం: నవంబర్ 3, రాత్రి 7:30 గంటలకు ప్రారంభం

ఆపేక్ష: ఇద్దరు వితంతువులు తమ జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోవడంపై ప్రదర్శన కార్యక్రమం.
స్థలం: పీబీఈఎల్ సిటీ, గండిపేట్ రోడ్, ఇబ్రహీంబాగ్, తారామతి బరాదరి
సమయం: నవంబర్ 4, రాత్రి 7:30 గంటలకు ప్రారంభం

ఆత్మకథ: సీనియర్ రచయిత కుల్బాషన్ వర్బంద తన జీవిత విశేషాలను యువ రచయితకు వివరించే ప్రక్రియ. ప్రతి గొప్పవ్యక్తి లోనూ ఆశ ఎప్పటికీ చావదు అనేది సారాంశం.
స్థలం: పీబీఈఎల్ సిటీ, గండీపేట్ రోడ్, ఇబ్రహీంబాగ్, తారామతి బరాదరి
సమయం: నవంబర్ 5, రాత్రి 7:30 గంటలకు ప్రారంభం

డెత్ వేరియేషన్స్: ప్రముఖ నటి, జానపద గాయని ఇలా అరుణ్ జీవిత సంఘటనలతో, థీమ్ ఆఫ్ డెత్ అని ప్రదర్శన.
స్థలం: పీబీఈఎల్ సిటీ, గండీపేట్ రోడ్, ఇబ్రహీంబాగ్, తారామతి బరాదరి
సమయం: నవంబర్ 6, రాత్రి 7:30 గంటలకు ప్రారంభం

మాస్టర్ సెషన్స్: ప్రముఖుల ప్రసంగాలు, జీవిత అంశాల ప్రస్తావన
స్థలం: ది ట్రైడెంట్ హోటల్, సైబర్ టవర్స్ దగ్గర, హైటెక్ సిటీ

నటి సుప్రియా పాథక కపూర్, నటుడు పంకజ్ కపూర్ ప్రసంగం
సమయం: నవంబర్ 1 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు

థియేటర్ డిజైన్ గురించి ఆ విభాగంలో నిపుణు మహమ్మద్ అలీ బేయిగ్ ఉపన్యాసం
సమయం: నవంబర్ 3 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు

జర్మనీ కొరియోగ్రాఫర్ విక్టోరియా హుక్ కొరియోగ్రఫీ గురించి పలు విషయాలను పంచుకుంటారు
సమయం: నవంబర్ 4 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు

నటి, జానపద గాయని ఇలా అరుణ్ థియేటర్ సంగీతం గురించి తన అనుభవాలను పంచుకుంటారు
సమయం: నవంబర్ 5 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు
స్థలం: ది ట్రైడెంట్ హోటల్, సైబర్ టవర్స్ దగ్గర, హైటెక్ సిటీ

విత్ అవుట్ యాసిడ్:  ప్రముఖ చిత్రకారిణి మాళవికా రెడ్డి ఆధ్వర్యంలో పెయింటింగ్స్ సోలో ప్రదర్శన కార్యక్రమం.
స్థలం: ది గ్యాలరీ కేఫ్, రోడ్డు నెంబర్ 10, బంజారా హిల్స్
సమయం: అక్టోబర్ 30, ఉదయం11.30 నుంచి రాత్రి 10.30 వరకు

క్లాసికల్ మ్యూజిక్:
సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న వారంరోజుల సంగీత కచేరీ. ప్రముఖ వయోలినిస్ట్ అవసరాల కన్యాకుమారి సహా పలువురి క్లాసికల్ మ్యూజిక్ ప్రదర్శన.
స్థలం: అసెంబ్లీ దగ్గర, లక్డీకపూల్, రవీంద్రభారతి
సమయం: నవంబర్ 2-8 తేదీలు, సాయంత్రం 6:15 గంటలకు

గుడ్ సీడ్స్ దివాలీ బజార్:
హస్తకళలు, ఇంట్లో తయారు చేసే వివిధ రకాల వస్తువుల ప్రదర్శన
స్థలం: సప్తపర్ణి, రోడ్ నంబర్ 8, బంజారాహిల్స్
సమయం: నవంబర్ 1, ఉదయం 10-2(మధ్యాహ్నం) గంటలు

మరిన్ని వార్తలు