ఐయామ్ కాలింగ్ ఫ్రమ్

19 Jan, 2015 00:17 IST|Sakshi
ఐయామ్ కాలింగ్ ఫ్రమ్

తెల్లవారింది మొదలు ‘ఐయామ్ కాలింగ్ ఫ్రమ్’ అంటూ టెలీ కాలర్ల నుంచి ఫోన్ రాగానే విసుక్కుంటాం. కానీ... టెలీ కాలర్ ఉద్యోగంలో ఉండే ఇబ్బందులను మనం పట్టించుకోం. ‘చాలామందికి టెలీ మార్కెటర్స్‌ని ఎగతాళి చేయడం ఒక హాబీ.  వారి మనసు ఆ సమయంలో ఎలా ఉందనేది ఎవరూ అర్థం చేసుకోరు’ అని చెప్తున్న స్వరూప్ ‘ఐయామ్ కాలింగ్’ పేరున లఘుచిత్రం తీశాడు. నెల్లూరు వాసి అయిన స్వరూప్ ఆర్‌ఎస్‌జే... ప్రస్తుతం బెంగళూరు ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నాడు.

అముల్ కంపెనీకి ఇతడు తయారుచేసిన ప్రకటన  జాతీయ స్థాయిలో టాప్ 20లో నిలిచింది. మోఫిల్మ్ గోవా కాంటెస్ట్‌కి రూపొందించిన ప్రకటన ఫైనల్స్ వరకు వచ్చింది. రాక్ మ్యూజిక్ బ్యాండ్‌తో తయారైన ఒక పాటను ఎంటీవీలో టెలికాస్ట్ చేశారు. ‘డెరైక్టర్ కావాలనేది నాకు పెద్ద కోరిక. దానికి ముందు షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నా. దానికి రూపమే ఈ చిత్రం. ఉద్యోగ బాధ్యతలో భాగంగానే టెలీకాలర్స్ ఫోన్ చేస్తుంటారు. ఇది అర్థం చేసుకోకుండా చాలామంది వారిని ఆట పట్టిస్తుంటారు. ప్రతివారి ఉద్యోగమూ గౌరవప్రదమైనదేనని భావించాలి. సినీ ప్రముఖులు చాలా మంది నన్ను అభినందించారు’ అని చెప్పాడు స్వరూప్.
  డా. వైజయంతి

మరిన్ని వార్తలు