కస్టమర్లకు ఐడియా షాక్!

2 Jul, 2016 12:26 IST|Sakshi
కస్టమర్లకు ఐడియా షాక్!

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఐడియా నెట్ వర్క్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిగ్నల్స్ ప్రాబ్లమ్ తో సతమవుతున్నారు. ఒక్కో సమయంలో కనీసం బీప్ కూడా అవకుండానే ఫోన్ కాల్స్ తొలి డయల్ కే కట్ అయిపోతున్నాయి. దీంతో తమ ఫోన్లకు సమస్యలు ఏర్పడ్డాయా.. లేక నెట్ వర్క్కా అని తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.

మొత్తం నగరమంతటా కూడా శనివారం ఉదయం ఇదే సమస్య తలెత్తింది. ఇప్పటికే పలువురు అసలు తమ ఐడియా నెట్ వర్క్ పనిచేయడం లేదని, సిగ్నల్స్ రావడం లేదని చెబుతున్నారు. దీనిపై సదరు నెట్ వర్క్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. కొంతమంది వినియోగదారులు మాత్రం సిగ్నల్స్ వచ్చి వెంటనే పోతున్నాయని, కాల్స్ కూడా వెంటవెంటనే కట్ అయిపోతున్నాయని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు