కాకినాడలో ఇంక్యుబేషన్ సెంటర్ : పల్లె

5 Jun, 2016 03:29 IST|Sakshi
కాకినాడలో ఇంక్యుబేషన్ సెంటర్ : పల్లె

సాక్షి, హైదరాబాద్: చైనా ప్రభుత్వ భాగస్వామ్యంతో కాకినాడలో రూ.16 కోట్ల వ్యయంతో ఇంక్యుబేషన్ సెంటర్‌ని ఏర్పా టు చేయనున్నట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుకు చైనాకు చెందిన జెడ్‌టీఈ సాఫ్ట్ టెక్నాలజీ, క్వినై అథారిటీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. సంవత్సర కాలంలో ఈ సంస్థ ఉత్పత్తిని ప్రారంభిస్తుందని, దీంతో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని చెప్పారు. రాష్ట్రంలో ఈ-ప్రగతి అమల్లోకి వస్తే సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఏపీ తొలి రాష్ట్రమవుతుందన్నారు. సమావేశంలోజెడ్‌టీఈ అంతర్జాతీయ సీఈఓ బెన్ జౌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు