ఉచిత ఎరువులు ఉత్తుత్తి పథకమేనా?

23 Apr, 2017 03:48 IST|Sakshi
ఉచిత ఎరువులు ఉత్తుత్తి పథకమేనా?

బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: దళిత సీఎం, కేజీ టు పీజీ విద్య, పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్ల మాదిరిగానే రైతు లకు ఉచితంగా ఎరు వుల పథకం కూడా ఉత్తుత్తి హామీయేనా? అని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ మాటల్లో నిజాయితీ కనిపించడం లేద న్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఏడాదే ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.

కేంద్ర ప్రభుత్వం మూడేళ్లలో రైతులను ఆదుకునేందుకు అనేక పథకాలను తీసుకొచ్చినా వాటిని రాష్ట్రంలో అమలు చేయకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. శని వారం పార్టీ నాయకులు ప్రకాశ్‌రెడ్డి, ఎన్‌వీ సుభాష్, సుధాకరశర్మ,, దాసరి మల్లేశం లతో కలసి ఇంద్రసేనారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో నష్ట పోయే రైతులను ఆదుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు