శిశుమరణాలు భారత్‌లోనే ఎక్కువ

9 Nov, 2013 04:29 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ‘ప్రపంచంలో ప్రతి మూడు శిశు మరణాల్లో ఒకటి భారత్‌లోనే నమోదవుతోంది. శిశుమరణాల రేటులో భారత్ 36వ స్థానంలో ఉంటే, సరిహద్దు దేశాలైన బంగ్లాదేశ్ 22, చైనా 11, పాకిస్థాన్ 8వ స్థాన ంలో ఉన్నాయి’ అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఎఫెక్టివ్ ఇంటర్వెన్షన్, నైస్ ఫౌండేషన్ శుక్రవారం హోటల్ రాడిసన్ బ్లూలో ఏర్పాటు చేసిన ‘బియాండ్ ది రెటోరిక్- సొల్యూషన్స్ టువార్డ్స్ నియోనాటల్ సర్వైవల్’ సదస్సును గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. దేశవిదేశాల వైద్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతిని ధులు పాల్గొన్నారు. 1990-2010 మధ్య కాలంలో ఐదేళ్లలోపు శిశుమరణాల రేటు 37 శాతం నుంచి 44 శాతానికి పెరిగిన తీరుపై ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో దేశానికి తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.
 
శిశుమరణాల రేటు తగ్గించడంలో ప్రభుత్వం కీలకపాత్ర పోషిస్తోందని గవర్నర్ చెప్పారు. శిశు మరణాల రేటును తగ్గించడంలో ప్రభుత్వం తగిన శ్రద్ద చూపడం లేదని వస్తోన్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు.


 ప్రైవేటు సంస్థలు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలపై కూడా ఈ బాధ్యత ఉందన్నారు. నైస్ ఫౌండేషన్ సీఈఓ పద్మనాభరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్, ఆరోగ్య కుంటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహాని, ఎఫెక్టివ్ ఇంటర్వెన్షన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పీటర్ బూనే, లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ డయానా ఎల్‌బౌర్న్, అలెగ్జాండర్ జెమ్స్ ఎబుల్ పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు