తప్పులో కాలేసిన ఇంటర్ బోర్డ్

24 Apr, 2016 07:20 IST|Sakshi
తప్పులో కాలేసిన ఇంటర్ బోర్డ్

 ప్రత్యూష ప్రాక్టికల్స్ మార్కులను పరిగణించని అధికారులు
 
 సాక్షి, హైదరాబాద్: తండ్రి, సవతి తల్లి చేతి లో చిత్రహింసలకు గురై పలువురి సహకారంతో పునర్జన్మ పొందిన ప్రత్యూష(పావని) ఇంటర్ ఫెయిల్ వెనక ఆయా ప్రభుత్వ విభాగాల నిర్లక్ష్యం వెల్లడైంది. ప్రాక్టికల్స్‌తోపాటు అన్ని పరీక్షలను ప్రత్యూష బాగానే రాసినా శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో ఆమె ఫెయిలైనట్లుగా ఇంటర్ బోర్డు ప్రకటించింది. అయితే, మొదటి సంవత్సరం పరీక్షలను సెయింట్ డేనియల్ కళాశాల, రెండో సంవత్సరం పరీక్షలను నారాయణ కళాశాల ద్వారా ప్రత్యూష రాసింది. ఈ రెండు పరీక్షలకు  వేర్వేరు హాల్‌టికెట్లు ఉండడంతో సమన్వయంలేమి కారణంగా ప్రాక్టికల్ పరీక్షల మార్కులను ఇంటర్ బోర్డు అధికారులు పట్టిం చుకోలేదు.

శాఖల మధ్య సమన్వయ లోపాన్ని ‘సాక్షి’ ప్రచురించటంతో డేనియల్ కళాశాల యాజ మాన్యం శనివారం మరోసారి ప్రత్యూష ప్రాక్టికల్ మార్కులను ఇంటర్ బోర్డుకు పంపింది. ఇంటర్ అధికారులు సైతం దొర్లిన తప్పులను సరిదిద్దే ఏర్పాట్లు చేశారు. ఈ విషయమై డేనియల్ కళాశాల ప్రిన్సిపాల్ బసవపున్నయ్య ‘సాక్షి’ తో మాట్లాడుతూ ప్రత్యూష రాత పరీక్షలతోపాటు, ప్రాక్టికల్స్‌లోనూ ఉత్తీర్ణత సాధిం చినట్లు చెప్పారు. త్వరలో ఆమెకు పాస్ మెమో వస్తుందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.

 అధికారులపై చర్యలు తీసుకోవాలి
 ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ప్రత్యూషను మరోసారి మానసికంగా హింసించిన సం బంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు