ఎస్‌ఆర్‌ఎంలో చేరేందుకు విద్యార్థుల ఆసక్తి

13 May, 2016 03:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు తమ యూనివర్సిటీలో చేరేందుకు ఆసక్తి కనబరిచారని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ పేర్కొంది. ఈనెల 11న బీటెక్‌లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రారంభమైందని, 20న ముగియనున్న బీటెక్ కౌన్సెలింగ్‌లో అనేక మంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌ను ఎంచుకున్నారని ఓ ప్రకటనలో తెలిపింది. 15 రాష్ట్రాలకు చెందిన టాప్ 100 మందికి స్కాలర్‌షిప్‌లను ఇవ్వనున్నట్లు వివరించింది. వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబర్చిన 9 మంది విద్యార్థులకు తొలిసారిగా గోల్డ్ మెడల్స్, సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది.

విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడమే కాకుండా నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు తాము ఎంతగానో కృషి చేస్తున్నామని ఎస్‌ఆర్‌ఎం విద్యా సంస్థల వ్యవస్థాపక చాన్స్‌లర్ టీఆర్ పారివేందర్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు