3 ఏళ్లు.. 61 దేశాలు

7 Mar, 2016 00:29 IST|Sakshi
3 ఏళ్లు.. 61 దేశాలు

ఇంటర్నేషనల్ సైకిల్ టూర్‌కు శ్రీకారం చుట్టిన గిన్నిస్ వీరుడు
 
‘సాధించాలనే తపన నీ సొంతమైతే లక్ష్యమే చిన్నబోతుంది. విజయమే తథ్యమవుతుంది.’ ఈ మాటల్ని అక్షరాలా నిజం చేశాడు నాగరాజు. చిన్ననాటి కలను నిజం చేసుకోవాలనే పట్టుదలతో సైక్లింగ్‌లో ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ సైకిల్ టూర్‌తో మరో రికార్డుకు శ్రీకారం చుట్టాడు. మూడేళ్లలో 61 దేశాలు సైకిల్‌పై చుట్టి వచ్చేందుకు ఆదివారం నగరం నుంచి బయలుదేరాడు.    - ఖైరతాబాద్
 
ప్రత్యేక సైకిల్

నాగరాజు ఈ టూర్ కోసం సైకిల్‌ను ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడు. రెండు జీపీఆర్‌ఎస్‌లు(లొకేషన్, ఫొటోలు తీసేందుకు), సైబర్‌షాట్, డీఎస్‌ఎల్‌ఆర్, మొబైల్ కెమెరాలు, ల్యాప్‌టాప్, దుస్తులు, స్నాక్స్.. ఇలా అన్ని సైకిల్‌కే అమర్చుకున్నాడు. వజ్ర సంకల్పంతో బయలుదేరిన నాగరాజు విజయంతో తిరిగిరావాలని ఆశిద్దాం.. ఆల్ ది బెస్ట్ నాగరాజు.
 
 

మరిన్ని వార్తలు