ఇస్రో గొప్ప విజయాలు సాధించింది

28 Jan, 2018 03:21 IST|Sakshi

ఇస్రో మాజీ చైర్మన్‌ కిరణ్‌కుమార్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఇస్రో గొప్ప విజయాలు సాధించిందని.. వాటి ఫలితాలను ప్రస్తుతం అనుభవిస్తున్నామని ఇస్రో మాజీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన పోలీస్‌ అకాడమీలో ఐపీఎస్‌ వ్యాస్‌ స్మారకోపన్యాసం ఇచ్చారు. రోడ్‌ నావిగేషన్, వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్, రైల్వే భద్రతలో టెక్నాలజీ వినియోగం, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్, శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీ తదితర అంశాల్లో ఇస్రో ప్రవేశపెట్టిన సాంకేతికతను ఆయన పోలీస్‌ అధికారులకు వివరించారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రెండు రాష్ట్రాల పోలీస్‌ విభాగాల సక్సెస్‌కు వ్యాస్‌ ఒక మార్గనిర్దేశకుడని అన్నారు. వ్యాస్‌ ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్‌ ఇప్పుడు దేశంలోనే అత్యంత కీలకమైన బలగంగా పేరు సంపాదించిందన్నారు. కార్యక్రమంలో వ్యాస్‌ సతీమణి అరుణా వ్యాస్‌ మాట్లాడుతూ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ కోసం వ్యాస్‌ బాగా కృషి చేశారని, పోలీస్‌ శాఖ కోసం ప్రాణాలను అర్పించిన గొప్ప వ్యక్తని గుర్తుచేశారు. కార్యక్రమంలో శాంతిభద్రతల అదనపు డీజీపీ అంజనీకుమార్, అకాడమీ డైరెక్టర్‌ జితేందర్, పలువురు పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు. 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బోనాల జాతర షురూ

కండీషన్స్‌ లేకుండా బీజేపీలో చేరుతా..

రాములు నాయక్‌కు సుప్రీంకోర్టులో ఊరట

‘ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి’

దోమల నిర్మూలనకు కొత్త మార్గం

‘నోటీసులుండవు; అక్రమమైతే కూల్చేస్తాం’

మేబీ అది ప్రేమేనేమో!

హోం మంత్రి మనవడి వీడియో.. వైరల్‌

వ్యయమే ప్రియమా!

రూల్స్‌ ఈజీ

ఆర్టీఏ.. అదంతే!

ఎట్టకేలకు మరమ్మతులు

ప్రేమ... పెళ్లి... విషాదం...

ఆటోలో మహిళ ప్రసవం

విదేశీ ఖైదీ హల్‌చల్‌

ప్రియుడు మోసం చేశాడని..బాలిక ఆత్మహత్య

అనాథలే ఆదాయం!

ఔను.. ఇది కిరోసిన్‌ ఫ్రిడ్జ్‌

వేడుకున్నా వదల్లే..

ట్రిపుల్‌ రైడింగ్‌.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి..!

చెవిమోతలో గ్రేటర్‌ ఫైవ్‌

డైరెక్టర్‌ రాజమౌళి.. యాక్టర్‌ లాయర్‌

గ్రహం అనుగ్రహం (19-07-2019)

నీళ్ల నిలువను, విలువను తెలిపే థీమ్‌పార్క్‌ 

బీజేపీలో నాకు తలుపులు మూసుకుపోలేదు..

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

అంత తొందరెందుకు..? 

కాంగ్రెస్‌ సభ్యుల నిరసన; కేసీఆర్‌ స‍్పందన

మనకూ ‘ముంబై’ ముప్పు

పట్నంలో అడవి దోమ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’