అది హక్కును హరించడమే

18 Feb, 2017 01:15 IST|Sakshi

పీడీ చట్టం కింద నమోదు చేసే కేసుల్లో ఉమ్మడి హైకోర్టు స్పష్టీకరణ
చిత్తూరు జిల్లా ఎస్పీకి రూ.25 వేల జరిమానా

సాక్షి, హైదరాబాద్‌:
ముందస్తు నిర్భంధ చట్టం (పీడీ యాక్ట్‌) కింద ఓ వ్యక్తిని నిర్భంధంలోకి తీసుకున్నప్పుడు, ఆ ఉత్తర్వులు, ఇతర డాక్యుమెంట్లను మాతృభాషలో అందజేయకపోవడం అతడి రాజ్యాంగ హక్కును హరిం చడమేనని హైకోర్టు స్పష్టం చేసింది. అలా  అంద జేయడంలో విఫలమైనం దుకు చిత్తూరు జిల్లా ఎస్పీకి రూ.25 వేల జరిమానా విధించింది.

ఇందులో రూ.10 వేలను హైకోర్టు లీగల్‌ సర్వీస్‌ కమిటీకి, రూ.15 వేలను పిటిషనర్‌కు చెల్లించాలంది. ఈ మొత్తాన్ని ఎస్పీ జీతం నుంచి మినహాయించాలంది. కాగా అజయ్‌కుమార్‌ అనే వ్యక్తిపై పీడీ చట్టం ప్రయోగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సురేశ్‌ కైత్, జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావుల ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.

మరిన్ని వార్తలు