టీసీఎస్ క్యాంపస్లో మొక్కలు నాటిన కేటీఆర్

11 Jul, 2016 10:11 IST|Sakshi

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం గచ్చిబౌలిలోని  టీసీఎస్ క్యాంపస్లో మొక్కలు నాటారు. నాటిన మొక్కలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు. హరితహారాన్ని ఓ ఉద్యమంగా నిర్వహిస్తామన్నారు. ఇకనుంచి మొక్కలు నాటితేనే భవనాల నిర్మాణాలకు అనుమతి ఇస్తామని కేటీఆర్ వెల్లడించారు.

అలాగే మొక్కలు నాటేవారికి ప్రోత్సాహాలు కూడా అందచేస్తామన్నారు. ఒక్కరోజే 25 లక్షలు మొక్కలు నాటుతున్నామని, ప్రజల భాగస్వామ్యంతోనే నిరంతరం హరితహారం కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని పెంచాలన్నారు. చెట్లు లేకపోవడం వల్ల సకాలంలో వర్షాలు పడటం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

అనంతరం బయో డైవర్సిటీ పార్కులోనూ మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాంధీతో పాటు టీసీఎస్ ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు. కాగా  నగరంలో నేడు 4,173 ప్రాంతాల్లో హరితహారం చేపట్టనున్నారు. ఇవాళ ఒక్కరోజే 25 లక్షల మొక్కలు నాటనున్నారు. ముఖ్యమంత్రి కేటీఆర్ నిమ్స్లో, చిత్రపురికాలనీలో రాజేంద్రప్రసాద్, పలువురు నటులు మొక్కలు నాటనున్నారు.

మరిన్ని వార్తలు