‘డిసెంబర్ 2ను ఉపాధి దినంగా ప్రకటించాలి’

12 Dec, 2016 15:07 IST|Sakshi
‘డిసెంబర్ 2ను ఉపాధి దినంగా ప్రకటించాలి’

హైదరాబాద్ : తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి వర్థంతి రోజును తెలంగాణ ఉపాధి దినంగా గుర్తించాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు.

శుక్రవారం ఓయూ అతిథిగృహం సెమినార్ హాల్‌లో నిర్వహించిన శ్రీకాంతాచారి ఏడో వర్థంతి సభలో ఆయన ప్రసంగించారు. శ్రీకాంతాచారి ఆత్మబలిదానంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిందని కోదండరాం అన్నారు. విశ్వకర్మ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు