సామాజిక న్యాయం కోసం జేఏసీ

12 Mar, 2017 00:54 IST|Sakshi

- జస్టిస్‌ చంద్రకుమార్‌
- కొత్త పార్టీ కూడా పెడతామని వెల్లడి


హైదరాబాద్‌: కుల వివక్ష లేని సమాజం, ప్రతి ఒక్కరికీ సామాజిక, ఆర్థిక న్యాయం అందేలా చూసేందుకు జేఏసీ ఏర్పాటు చేస్తున్నట్లు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ చంద్ర కుమార్‌ ప్రకటించారు. అలాగే జేఏసీ ఆధ్వర్యంలో కొత్త పార్టీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల ఉమ్మడి నాయకత్వంతో పార్టీ కొనసాగు తుం దని వెల్లడించా రు. తెలంగాణ లో రాజకీయ పత్యామ్నాయంగా జేఏసీ ఉండ బోతోందని చెప్పారు. జేఏసీ మొదటి సమావేశాన్ని 16న సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..  సమాజంలో కుల వివక్ష ఇంకా కొనసాగుతోందని, దళితులు, ఆదివాసీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జేఏసీలో భాగస్వామ్యం అయ్యేం దుకు కుల, వృత్తి సంఘాల వారు, అగ్రకులాలలోని పేదవారు, నిజాయితీగా పనిచేసేవారు 9394345252, 9505932030 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. ప్రొఫెసర్‌ ఐ.తిరుమలి మాట్లాడుతూ.. ‘ఆంధ్రాపాలన పోతే మనకు రాజకీయం దగ్గరవుతుంది, మన సమస్యలు వినేవారు వస్తారు అనుకున్నాం, రాష్ట్రం మారింది కాని పాలకుల తీరు మారలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు