నేడు రాజధాని ప్రాంతంలో జగన్‌ పర్యటన

19 Jan, 2017 01:40 IST|Sakshi
నేడు రాజధాని ప్రాంతంలో జగన్‌ పర్యటన

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఉదయం 8.30కి ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రాజధాని అమరావతి ప్రాంతానికి బయలుదేరుతారు. మంగళగిరి శాసనసభా నియోజకవర్గంలోని నిడమర్రు గ్రామంలో ఉదయం 9.30 గంటల నుంచి, తాడికొండ నియోజకవర్గంలోని లింగాయపాలెంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి పర్యటిస్తారు. టీడీపీ ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తున్న బాధిత రైతులకు జగన్‌ ముఖాముఖిగా మాట్లాడి వారి మనోభావాలను తెలుసుకుంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధిగా వెల్లంపల్లి శ్రీనివాస్‌  
వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ నియమితులయ్యారు. అధినేత  జగన్‌ ఆదేశాల మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా, పార్టీ అధికార ప్రతినిధిగా వెల్లంపల్లిని నియమించినట్టు పార్టీ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.