రైతును రాజు చేసింది సీఎం కేసీఆరే..

15 May, 2017 02:15 IST|Sakshi
రైతును రాజు చేసింది సీఎం కేసీఆరే..

మంత్రి  జగదీశ్‌రెడ్డి
సత్తుపల్లి: తెలంగాణ ఉద్యమం పుట్టిందే రైతుల కోసం.. రైతు ను రాజు చేసింది సీఎం కేసీఆరే అని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తు పల్లిలో డీసీసీబీ బ్రాంచ్‌ నూతన భవనాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలసి ఆది వారం ఆయన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ 60 ఏళ్ల పాల నలో పాలకులు రైతుల బాధలు పట్టించుకో లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం రాని కరెంట్‌కు బిల్లులు వసూలు చేసిందని ఆరోపించారు.

తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ వ్యవసాయంపై దృష్టిపెట్టి రైతులకు మేలు చేయాలనే తపనతో పని చేస్తున్నారన్నారు. రైతు రాజ్యమంటే తెలంగాణ ఒక్కటే అని.. వ్యవ సాయంలో రైతులను అన్ని విధాలుగా ఆదు కుంటూ అభివృద్ధి చేస్తున్నామన్నారు. రైతు లకు పంట రుణాలతో పాటు వ్యవసాయ ఆధారిత రుణాలను అందిస్తూ రైతులకు ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయబాబు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గడిపల్లి కవిత, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

నర్సరీలకు ఉచిత విద్యుత్‌
దమ్మపేట(అశ్వారావుపేట): రాష్ట్రంలో  నర్స రీలకూ ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తామని మంత్రి జి. జగదీశ్‌రెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అల్లి పల్లిలో విలేకరులతో మాట్లాడారు. విద్యుత్‌ బిల్లులు చెల్లించలేక చాలామంది నర్సరీలను మూసివేసే పరిస్థితి ఉందన్నారు.

మరిన్ని వార్తలు