జైజై గణేశా!

17 Sep, 2015 03:15 IST|Sakshi
జైజై గణేశా!

త్రిశక్తివుయు మోక్ష గణపతి.. అవరోహణ క్రవూనికి ఈ ఏడాది నుంచి సిద్ధయ్యూడు. ఇకపై ఏటా ఒక్కో అడుగు తగ్గుతూ 2074 నాటికి ఒక్క అడుగు బుల్లి గణపతిగా దర్శనమివ్వనున్నాడు. కుడివైపు గజేంద్ర మోక్షం.. ఎడవైపు వరంగల్ భద్రకాళి విగ్రహాలతో... 59 అడుగుల ఎత్తులో గణనాథుడు భక్తులను కనువిందు చేయనున్నాడు. సర్వజనుల సంక్షేవుం కోసం నీలివర్ణంలో దర్శనమివ్వడం ఇదే తొలిసారి. హా గణపతి చేతిలో 6 టన్నుల బరువైన లడ్డూ ఏర్పాటు చేయనున్నారు.
 
 సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ వినాయకచవితి సంబరాలకు సిద్ధమైంది. గురువారం నుంచి నవరాత్రి వేడుకలు ప్రారంభమవుతుండటంతో బుధవారం నుంచే నగరంలో సందడి మొదలైంది. పండుగ గిరాకీని దృష్టిలో పెట్టుకొని నగరం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పండ్లు, పత్రిని తీసుకొచ్చి ప్రధాన కూడ ళ్లు, రోడ్ల పక్కన, రైతుబజార్లు, కూరగాయల మార్కెట్ల వద్ద విక్రయించారు. వివిధ వర్గాల వారు పూలు, పండ్లు, పత్రి కోనుగోలు చేయడంతో కూడళ్లు జాతరను తలపించాయి.

కూరగాయల మార్కెట్లు, రైతుబజార్లకు జనం పోటెత్తడంతో ఆ ప్రాంతాలు కిటకిటలాడారుు. ప్రధాన మార్గాలతో పాటు గల్లీలలోనూ వినాయక ప్రతిమలు విక్రరుుంచే దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారుు. ప్రజల్లో పర్యావరణ స్పృహ పెరిగింది. ఫలితంగా మట్టితో తయూరు చేసిన వినాయక ప్రతిమలకు ఈ ఏడాది గిరాకీ బాగా పెరిగింది. ఈ విషయంలో పర్యావరణవేత్తల కృషి కొంతమేరకు ఫలించిందనే చెప్పాలి.

 జోరుగా పూల విక్రయాలు
 గుడిమల్కాపూర్‌లోని హోల్‌సేల్ పూల మార్కెట్ వినియోగదారులతో బుధవారం కిక్కిరిసిపోయింది. ఈ ఏడాది పెద్దమొత్తంలో పూలు దిగుమతయ్యాయి. హోల్‌సేల్ మార్కెట్లో ధరలు అందుబాటులో ఉన్నా... రిటైల్ మార్కెట్లో మాత్రం భగ్గుమన్నాయి. ఉదయం పూట కిలో రూ.60-50 ధర పలికిన బంతిపూలు... సాయంత్రానికి రూ.20-30కి దిగివచ్చాయి. ఉదయం 11 గంటల తర్వాత పెద్దమొత్తంలో సరుకు మార్కెట్‌కు రావడంతో ఒక్కసారిగా ధర పడిపోయింది.

బంతి, చామంతి, గులాబీ, కాగడామల్లె, సన్నజాజి, కనకాంబరాలు వంటివి సుమారు 150 టన్నులు దిగుమతయ్యాయి. బుధవారం ఒక్కరోజే రూ.కోటికి పైగా వ్యాపారం సాగినట్లు కమీషన్ వ్యాపారులు తెలిపారు. ధరలు తగ్గినా కొనేవారు లేకపోవడంతో సుమారు 25-30 టన్నులు పారబోసినట్టు వివరించారు. రిటైల్ మార్కెట్లో మాత్రం బంతిపూలు కేజీ రూ.90-100 వంతున విక్రయించారు. విడిపూలతో పాటు దండలూ విక్రయించారు. వివిధ కాలనీల యువకులు వాహనాలతో తరలివచ్చి మండపాల్లో ప్రతిష్టించేందుకు పెద్ద విగ్రహాలను కొనుగోలు చేశారు.

మరిన్ని వార్తలు