జంపన్న ద్రోహం చేశాడు

28 Dec, 2017 11:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ సభ్యుడు జినుగు నర్సింహారెడ్డి అలియాస్‌ జంపన్న ద్రోహం చేశాడని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిథి అభయ్‌ లేఖ ద్వారా తెలిపాడు. లేఖ సారాంశం..జంపన్నను ఏడాది క్రితం సస్పెండ్ చేశామని చెప్పారు. సస్పెండ్ తర్వాతే మావోయిస్టు పార్టీతో విభేదిస్తున్నట్లు తమతో చెప్పాడని వెల్లడించారు. లొంగుబాటు గురించి తమతో చర్చించలేదన్నారు. 

జంపన్న శత్రువు ముందు మోకరిల్లాడని, మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల పట్టు కోల్పోయాడని విమర్శించారు. మావోయిస్టు పార్టీ పై ఆయన వ్యాఖ్యలు అర్ధరహితమని, ఎర్రజెండా నీడలో మావోయిస్టు పార్టీ బలంగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సొంత లాభం , రాజకీయ స్వార్ధం కోసమే జంపన్న పార్టీని వీడాడని లేఖ ద్వారా విమర్శించారు.
 

మరిన్ని వార్తలు