అధికార గర్వంతో మాట్లాడతారా?

20 Apr, 2017 00:30 IST|Sakshi
అధికార గర్వంతో మాట్లాడతారా?

కేటీఆర్, కవితపై కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి ధ్వజం
►  కాంగ్రెస్‌ను పాతరపెట్టాలంటూ వారు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం
► కేసీఆర్‌కు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చుంటే టీఆర్‌ఎస్‌ పుట్టేదా?
► తెలంగాణ కోసం కేటీఆర్, కవిత ఏనాడైనా జైలుకెళ్లారా?


సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని పాతరపెట్టాలంటూ మంత్రి కె.తారక రామారావు, ఎంపీ కవిత జగిత్యాల సభలో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుప డ్డారు. సీఎం కేసీఆర్‌ కంటే ముందుగానే మంత్రిగా పనిచేసిన తనపై ఆయన పిల్లలైన కేటీఆర్, కవిత అహంకారపూరితంగా, అధి కార గర్వంతో మాట్లాడుతున్నారన్నారు.

మంగళవారం ఇక్కడ జీవన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కేటీఆర్‌ను ప్రమోట్‌ చేసుకోవ డానికే జగిత్యాల సభ పెట్టారన్నారు. ‘‘తెలం గాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను పాతరపెడా ్తరా? మిగులు బడ్జెట్‌తో ఏర్పాటైన రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసిన టీఆర్‌ఎస్‌ విధానా లను విమర్శిస్తే కాంగ్రెస్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడ్తారా? మూడేళ్ల పసిగుడ్డు పాలనతోనే రాష్ట్ర బడ్జెట్‌ రూ.లక్షన్నర కోట్లకు వచ్చిందా? కాంగ్రెస్‌ అభివృద్ధే చేయలేదా? టీఆర్‌ఎస్‌ ఇంకా ఉద్యమంలో ఉందా లేక ప్రభుత్వంలో ఉందా అనేది మాట్లాడే ముందు ఆలోచించు కోవాలి’’ అని జీవన్‌రెడ్డి చెప్పారు.

నా చరిత్ర మీ నాయినను అడగండి...
‘‘నేను మంత్రి పదవి కోసమే కరీంనగర్‌ ఉప ఎన్నికలో పోటీ చేసినట్లు కేటీఆర్, కవిత మాట్లాడటం వారి అవివేకం. నా రాజకీయ చరిత్ర ఏమిటో వాళ్ల నాయిన కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలి. కేసీఆర్‌ కంటే ముందుగానే ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన. 1999 ఎన్ని కల తర్వాత కేసీఆర్‌కు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చుంటే టీఆర్‌ఎస్‌ పుట్టేదా? ఎన్టీఆర్‌ కు వెన్నుపోటు పొడిచే సమయంలో చంద్ర బాబుకు కేసీఆర్‌ తాబేదారుగా పనిచేశాడు.

చంద్రబాబు మోచేతి నీళ్లుతాగుతూ మంత్రి పదవిని అనుభవించినంతకాలం గుర్తుకురాని తెలంగాణ... పదవి రాకపోయేసరికి కేసీఆర్‌ కు గుర్తుకొచ్చింది. టీఆర్‌ఎస్‌ పెట్టిన తర్వాత 2004లో కాంగ్రెస్‌ కండువా వేసుకుని కరీంన గర్‌ ఎంపీగా కేసీఆర్‌ గెలవలేదా? అధికార పార్టీలో ఉంటూనే తెలంగాణ కోసం పోరాడి, జైలుకు పోయిన చరిత్రనాది. తెలంగాణ కోసం ఏనాడైనా, ఒక్కరోజైనా కేటీఆర్, కవిత జైలుకు పోయారా? వాస్తవాలను దాచిపె ట్టాలనుకుంటే చరిత్ర మారదు’’ అని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

పూర్తి చేయాలనే సంకల్పమేదీ?
టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సంకల్పంలేదని జీవన్‌రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహా రం ఇవ్వకుండా, పునరావాసం కల్పించ కుండా ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నించారు.

శాసనసభలో తాను మాట్లాడని మాటలను ప్రస్తావించిన కేటీఆర్‌పై ప్రివిలేజ్‌ నోటీసు ఇస్తానని జీవన్‌రెడ్డి హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లు నిద్రపోయి, సింగరేణిలో ఎన్నికలు రాగానే హడావిడిగా వారసత్వ ఉద్యోగాల కల్పన పేరుతో టీఆర్‌ఎస్‌ డ్రామాలకు తెరలేపిందని విమర్శించారు. కోర్టులతో ఇన్నిసార్లు మొట్టికాయలు తిన్న ప్రభుత్వం ఏదీ లేదని, అధికారంలో కొనసాగే అర్హత కూడా టీఆర్‌ఎస్‌కు లేదన్నారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ఒకటి, రెండు తప్ప ఏవీ అమలు చేయలేదన్నారు.

హరీశ్‌పై కేటీఆర్‌ వ్యాఖ్యల్లో మర్మం ఏమిటో?
కాంగ్రెస్‌లోకి హరీశ్‌రావు వెళ్లడు అని స్వయంగా మంత్రి కేటీఆర్‌ అన్నాడంటే అందులో ఏదో మర్మం ఉందని... బయట కు కనిపించని రాజకీయ పరిణామాలేవో టీఆర్‌ఎస్‌లో అంతర్గతంగా జరుగుతుండొ చ్చని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హరీశ్‌ రావు, కాంగ్రెస్‌ అంటూ కేటీఆర్‌కు అనుమా నం ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు.

కాంగ్రెస్‌ పార్టీయే బాహుబలి అని, కాంగ్రెస్‌ లో నాయకులు లేరని హరీశ్‌రావును పిలుస్తామా అని ప్రశ్నించారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అహంకార  ధోర ణి చూస్తుంటే వాళ్లకు ఘడియలు దగ్గర పడుతున్నట్టున్నాయని జీవన్‌రెడ్డి హెచ్చరిం చారు. అంబేడ్కర్‌ జయంతినాడు నివాళులు అర్పించడానికి రాని దౌర్భాగ్యుడు కేసీఆరే నన్నారు. లైసెన్సు లేకుండా మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తన కుర్చీని కాపాడుకోవడానికి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు