రేపే జాబ్‌మేళా.. వెంటనే నియామకాలు!

18 Apr, 2016 20:04 IST|Sakshi
కంటోన్మెంట్: హైదరాబాద్‌ లోని నిరుద్యోగులకు శుభవార్త. ఐటీ, టెక్నికల్, నాన్ టెక్నికల్, ఫార్మా, సేల్స్, మార్కెటింగ్ రంగాల్లో అర్హులైన వారికి ఉద్యోగులు కల్పించేందుకు మంగళవారం సికింద్రాబాద్‌లో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (ఎస్‌సీబీ) ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరుగనుంది. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు సాగే ఈ కార్యక్రమాన్ని మెప్మా పీడీ, జలమండలి ఎండీ దానకిశోర్ ప్రారంభించనున్నారు. 
 
ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, టెక్నికల్, నాన్‌టెక్నికల్, ఫార్మా, సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లో మొత్తం 27 విభాగాల ఉద్యోగాల్లో నియామకాలు చేపట్టనున్నట్లు మెప్మా కంటోన్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ ప్రకాశ్ తెలిపారు. కేటగిరీలవారీగా అర్హులైన అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో మేళాకు రావాల్సిందిగా సూచించారు. ఈ మేళాలో సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వ్యూలను అక్కడికక్కడే నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడతారని పేర్కొన్నారు. 
Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు