పర్యావరణహితంగా పండుగలు జరుపుకోవాలి

27 Oct, 2016 02:38 IST|Sakshi

గ్రీన్ దీపావళి పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి జోగు రామన్న

 సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత జీవన విధానంలో ప్రకృతికి నష్టం కలిగించని రీతిలో పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఉందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. దీపావళికి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చడం వల్ల శబ్ద, వాయుకాలుష్యం ఏర్పడి మనుషుల ఆరోగ్యం, పెంపుడు జంతువులపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతోందన్నారు. భూగోళం వేడెక్కి, వాతావరణంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. గ్రీన్ దీపావళి జరుపుకోవాలని కోరుతూ శ్వాస ఫౌండేషన్ రూపొందించిన పోస్టర్‌ను బుధవారం సచివాలయంలో జోగురామన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్వాస ఫౌండేషన్ అధ్యక్షురాలు జి.కళ్యాణి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

మరిన్ని వార్తలు