‘ఏకీకృత సర్వీస్‌’కు న్యాయశాఖ ఆమోదం

12 May, 2017 02:48 IST|Sakshi
‘ఏకీకృత సర్వీస్‌’కు న్యాయశాఖ ఆమోదం

ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ అమలుకు సంబంధించిన ఫైలును కేంద్ర న్యాయ శాఖ ఆమోదించిందని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తెలిపారు. ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డితో కలసి వేణుగోపాలాచారి గురువారం కేంద్ర న్యాయశాఖ లెజిస్లేటివ్‌ కార్యదర్శి నారాయణ రాజుతో సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రా ల్లో ఏకీకృత సర్వీసు రూల్స్‌ అమలుపై చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... సంబంధిత ఫైలును లెజిస్లే టివ్‌ కార్యదర్శి ఆమోదించి, కేంద్ర హోంశాఖ కు పంపినట్టు తెలిపారు. ఇది ఆమోదం పొందితే తెలుగు రాష్ట్రాల్లో పంచాయతీరాజ్‌ వ్యవస్థలో పనిచేస్తున్న 3లక్షల మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కేంద్ర హోం శాఖకు పంపిన ఈ ఫైలు త్వర లోనే రాష్ట్రపతి ఆమోదం కూడా పొందే అవకాశం ఉంద ని వారు వెల్లడించారు.

‘భగీరథ’కు బదలాయించండి...
మిషన్‌ భగీరథ పనుల నిమిత్తం కొన్ని ప్రాం తాల్లో పైప్‌లైన్ల ఏర్పాటుకు ఇవ్వాల్సిన అను మతులను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అనిద్‌ మాధవ్‌ దవేను వేణుగోపాలాచారి కోరారు. పైప్‌లైన్ల ఏర్పాటుకు అవసరమైన అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలా యించి అనుమతులు ఇవ్వాలన్నారు.  కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తోనూ సమావేశమై కొత్త జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయా లని, సర్వశిక్షా అభియాన్, రాజీవ్‌ విద్యా మిషన్‌ కింద రావాల్సిన నిధులను విడు దల చేయాలని వేణుగోపాలాచారి కోరారు.

>
మరిన్ని వార్తలు